ఆదివారం, మార్చి 19, 2017

నేడే ఈనాడే కరుణించె...

భలేతమ్ముడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భలేతమ్ముడు (1969)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : డా. సి.నారాయణరెడ్డి
గానం : మహ్మద్ రఫీ, పి.సుశీల

నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే
అహహా ఆ... అహహా ఆ...

కనులముందున్న రతనాలమూర్తిని
విలువలెరుగక విసిరితిని
కనులముందున్న రతనాలమూర్తిని
విలువలెరుగక విసిరితిని
కనుల తెరచీ విలువ తెలిసి
కనుల తెరచీ విలువ తెలిసి
మనసే గుడిగా మలచితిని
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే 
మదిలో విరిసే మమతల మాలలు
చెలిమికి కానుక చేసెదను
మదిలో విరిసే మమతల మాలలు
చెలిమికి కానుక చేసెదను
ఆరని వలపుల హారతి వెలుగుల
ఆరని వలపుల హారతి వెలుగుల
కలకాలం నిను కొలిచెదను

నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే
 చిలిపిగ కసిరే...
చిలిపిగ కసిరే చెలియ విసురులో
అలకలు గని నవ్వుకున్నాను అహ్హహ్హ
చేతులు సాచి చెంతకు చేరిన
చేతులు సాచి చెంతకు చేరిన
ఆ చెలినే అందుకున్నాను
ఆ చెలినే అందుకున్నాను

నేడే ఈనాడే మురిపించె నన్ను చెలి తానే 
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈనాడే మురిపించె నన్ను చెలి తానే 
అహహా ఆ... అహహా ఆ... ఓహోహో..హో..

 

2 comments:

ఈ మూవీలో..యెంతవారు కానీ సాంగ్ కుడా రఫీ గారి గొంతులో చాలా హుషారుగా ఉంటుంది..

అవునండీ రఫీ గారి తెలుగు పాటలు భలే గమ్మత్తుగా ఉంటాయి.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.