మంగళవారం, మార్చి 21, 2017

మరదల పిల్ల ఎగిరిపడకు...

గండికోట రహస్యం సినిమాలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.

చిత్రం : గండికోట రహస్యం (1969)
సంగీతం : టి.వి. రాజు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల

మరదల పిల్ల ఎగిరిపడకు.. గడసరి పిల్ల ఉలికిపడకు
నా గెలుపే నీ గెలుపు కాదా.. నా గెలుపే నీ గెలుపు కాదా

మరదల పిల్ల ఎగిరిపడకు.. గడసరి పిల్ల ఉలికిపడకు
నా గెలుపే నీ గెలుపు కాదా.. నా గెలుపే నీ గెలుపు కాదా..

మొగిలిపువ్వులా సొగసుందీ..ఈ.. ముట్టుకుంటే గుబులౌతుంది
మొగిలిపువ్వులా సొగసుందీ..ఈ.. ముట్టుకుంటే గుబులౌతుంది
కోడెత్రాచులా వయసుంది.. అది కోరుకుంటే దిగులౌతుంది
కోడెత్రాచులా వయసుంది.. అది కోరుకుంటే దిగులౌతుంది
ఆ కోపంలో భలే అందముంది.. ఆ కోపంలో భలే అందముంది

మరదల పిల్ల ఎగిరిపడకు.. గడసరి పిల్ల ఉలికిపడకు
నా గెలుపే నీ గెలుపు కాదా.. నా గెలుపే నీ గెలుపు కాదా..

కసురుకుంటే కవ్విస్తానూ..ఊ.. విసురుకుంటే ఉడికిస్తాను
కసురుకుంటే కవ్విస్తానూ..ఊ.. విసురుకుంటే ఉడికిస్తాను
ముక్కు తాడు తగిలిస్తాను.. ఆ మూడుముళ్ళు వేసేస్తాను
ముక్కు తాడు తగిలిస్తాను.. ఆ మూడుముళ్ళు వేసేస్తాను
ఏనాడైనా నీ వాడ నేను.. ఏనాడైనా నీ వాడ నేను..

మరదల పిల్ల ఎగిరిపడకు.. గడసరి పిల్ల ఉలికిపడకు
నా గెలుపే నీ గెలుపు కాదా.. నా గెలుపే నీ గెలుపు కాదా..

2 comments:

యన్.టి.ఆర్ మాజిక్..

అవునండీ రామారావు గారి మాజిక్ :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.