శుక్రవారం, జనవరి 20, 2017

ఎకిమీడా...

గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : గౌతమి పుత్ర శాతకర్ణి (2017)
సంగీతం : చిరంతన్ భట్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఉదిత్ నారాయణ్, శ్రేయఘోషల్

ఎకిమీడా....
ఎకిమీడా నా జతవిడనని వరమిడవా
తగుతోడా కడకొంగున ముడిపడవా
సుకుమారీ నీ సొగసు సిరిలు 
నను నిలువెల్లా పెనవేసుకుని
మహారాజునని మరిపించే 
నీ మహత్తులో పడి బంధీనైనానే ఎటెళ్తానే

హుందర హుందర హుందర హురదర 
హుందర హుందర హుందర హురదర 
హుందర హుందర హుందర హురదర 
హుందర హుందర హోయ్.. 
హుందర హుందర హుందర హురదర 
హుందర హుందర హుందర హురదర 
హుందర హుందర హుందర హురదర 
హుందర హుందర హోయ్..

కడవై ఉంటా నడుమొంపుల్లో 
కులికే నడకా నను కాసుకో గుట్టుగా
కోకా రైకా నువ్వనుకుంటా 
చక్కెర తునకా చలికాచుకో వెచ్చగా 
చెంత చెలవ చిరు చినుకు చొరవ 
ఈ తళ తళ తళ తరుణి తనువుకిది ఎండోవానో  
ఎండో వానో ఎవరికెరుక  ఏ వేళాపాళా ఎరుగననీ
ప్రతీరోజిలా నీతో పాటే నడుస్తు గడిస్తే
ఎన్నాళ్ళైతేనేం.. ఎటైతేనేం

హుందర హుందర హుందర హురదర 
హుందర హుందర హుందర హురదర 
హుందర హుందర హుందర హురదర 
హుందర హుందర హోయ్.. 
హుందర హుందర హుందర హురదర 
హుందర హుందర హుందర హురదర 
హుందర హుందర హుందర హురదర 
హుందర హుందర హోయ్.. 

ఎకిమీడే నీ జత విడనని వరమిడెనే వరమిడవా 
సరిజోడే నీ కడకొంగున ముడి పడెనే 

వీరి వీరి గుమ్మడంటు వీధి వాడ సుట్టుకుంటు 
ఇంతలేసి కళ్ళతోటి వింతలెన్నో గిల్లుకుంటు 
ఒళ్ళోన వాలనా ఇయ్యాల సయ్యాటలో సుర్రో.. 

కోడెగాడు పక్కనుంటె ఆడ ఈడు ఫక్కుమంటే 
మన్ను మిన్ను సూడనంటు మేలమాడుకుంటు ఉంటె 
మత్తెక్కి తూగాల మున్నూర్ల ముప్పొద్దులూ సుర్రో

ఎకిమీడా.... 

5 comments:

ఇంత దరిద్రంగా ఉన్నాయి లిరిక్స్. సీతారామశాస్త్రి ఇటువంటి చెత్త పాట రాశారంటే ఆశ్చర్యంగా ఉంది. ఎకిమీడా ఏమిటి పిండాకూడు.

అజ్ఞాత గారు 'ఎకిమీడు' అంటే 'రాజు' అండి... అచ్చ తెలుగు పదాలతో భావాలతో సిరివెన్నెల గారు బాగా రాశారీ పాటను. ఈ లిరిక్ చదువుతూ మరోసారి విని చూడండి.

సారీ వేణు శ్రీకాంత్ గారు. ఈ పాటలో ఏమి భావాలు ఉన్నాయి. పరమ చెత్తగా ఉంది.

అయ్యో సారీ ఎందుకండీ.. జిహ్వకో రుచి.. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.