శనివారం, జనవరి 14, 2017

మా ఇంట వెలసింది సంక్రాంతి లక్ష్మీ...

మిత్రులందరకూ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు బెట్టింగ్ బంగార్రాజు చిత్రంలోని ఒకచక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బెట్టింగ్ బంగార్రాజు (2010)
సంగీతం : శేఖర్ చంద్ర
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : వేణుగోపాల్, గీతామాధురి

గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో గుమ్మాడీ..
గోమాత గొబ్బిళ్ళో గుమ్మాడీ..
పల్లె పడుచులకు పెళ్ళి దీవెనలు
అందించే గొబ్బిళ్ళూ
ఆడపడుచులకు పసుపు కుంకుమలు
నిలబెట్టే గొబ్బిళ్ళూ

మా ఇంట వెలసింది సంక్రాంతి లక్ష్మీ

మా ఇంట వెలసింది సంక్రాంతి లక్ష్మీ
సిరులెన్నో కురిపించె సౌభాగ్యలక్ష్మీ
స్వయంవరానికి ముస్తాబైన సీతల్లే
సొగస్సుకొమ్మకి సిగ్గై పూచిన పూతల్లే
భోగీ పెదపండుగ కనుమ ముక్కనుమ
తనకై చూస్తూండగా కదిలొచ్చింది సుమా

మా ఇంట వెలసింది సంక్రాంతి లక్ష్మీ
సిరులెన్నో కురిపించె సౌభాగ్యలక్ష్మీ

సాహోరే సాహోరే సంక్రాంతి లక్ష్మి
ఊహల్లో ఊరేగే మా సీతామాలక్ష్మి

భయమూ బాధా పాతపడ్డవని
మంటలు కలిపింది భోగి మంటలు కలిపింది
ముసి ముసి నవ్వుల కొత్తకాంతిని
ముంగిట నిలిపింది ఇంటి ముంగిట నిలిపింది
ఏలేలో ఈ నిప్పుల చుట్టూ చేరీ వేసే చిందులు
ఏదోరోజూ ఏడడుగులుగా ఎదురొస్తాయని చెప్పింది
మకర రాశిలో అడుగేశాడోయ్ అడుగో సూరీడూ
మన పంటలపై బంగారాలా వెలుగులు చూపాడూ
గల గల గల మా గాదె లోపల 
ధాన్యరాసులే నింపాడూ
ఈ సుగుణాల రాశికి తగువాణ్ణి 
రాసి ఉంటాడు రాసే ఉంటాడూ

మా ఇంట వెలసింది సంక్రాంతి లక్ష్మీ
సిరులెన్నో కురిపించె సౌభాగ్యలక్ష్మీ

కలసి మెలసి పంచుకోండీ అని
అంటూందీ కనుమ బంతి భోజనముల నడుమ
కలిగిన దానిలో దానమివ్వమని
తెలిపే ముక్కనుమా ఇచ్చే దీవెనలను కనుమా
ఊరూరూ రధం ముగ్గులన్నీ కలిసీ ఊరు ఇప్పుడు
సీతారాముల పెళ్ళి మంటపంలా ఉన్నది చూడమ్మా
ఏటికోదరి వచ్చే పండుగ అయినా ఈనాడూ
కోటికొక్కడౌ వరుడిని ఇచ్చే 
వదులును మా గూడూ
తళ తళ మెరిసేటి బొమ్మకీ 
కాళ్ళు కందనివ్వడు వాడూ
ఈ జన్మంతా తోడుగా 
వాడు ఉంటాడూ వాడే ఉంటాడూ

మా ఇంట వెలసింది సంక్రాంతి లక్ష్మీ
సిరులెన్నో కురిపించె సౌభాగ్యలక్ష్మీ
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.