శనివారం, అక్టోబర్ 08, 2016

శ్రీ శారదాంబా నమోస్తుతే...

సరస్వతీ దేవి అలంకరణలో భక్తులను కరుణించనున్న అమ్మవారికి మనసులోనే నమస్కరించుకుంటూ ఈ రోజు శృతిలయలు చిత్రంలోని ఈ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రుతిలయలు (1987) 
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : ఎస్.జానకి

శ్రీ శారదాంబా నమోస్తుతే
శ్రీ శారదాంబా నమోస్తుతే
సంగీత సాహిత్య మూలాకృతే
శ్రీ శారదాంబా నమోస్తుతే
సంగీత సాహిత్య మూలాకృతే
శ్రీ శారదాంబా నమోస్తుతే

నాద సాధనే ఆరాధనం
రాగాలాపనే ఆవాహనం
నాద సాధనే ఆరాధనం
రాగాలాపనే ఆవాహనం
గళపీఠమే రత్న సింహాసనం 
గళపీఠమే రత్న సింహాసనం 
సరిగమల స్వరసలిల సంప్రోక్షణం

శ్రీ శారదాంబా నమోస్తుతే

నా గానమే నీరాజనం 
నా ప్రాణమే నివేదనం 
నా గానమే నీరాజనం 
నా ప్రాణమే నివేదనం 
శ్వాసకీఇలా స్వరనర్తనం
శ్వాసకీఇలా స్వరనర్తనం
సంగీత భారతికి సంకీర్తనం 

శ్రీ శారదాంబా నమోస్తుతే

వాగీశా వల్లభ
శ్రీ శారదాంబా
శ్రిత సరసిజాసన 
స్మిత మంగళానన
శ్రీ శారదాంబా
సిద్ది ప్రదాయని 
బుద్ది ప్రసాదిని 
గీర్వాణి వీణాపాణి 
శ్రీ శారదాంబా
లలిత లయ జనిత 
మృదుల పద గమిత 
లలిత లయ జనిత 
మృదుల పద గమిత 

కావ్య గాన లోల 
శంకర అచ్యుతాది 
సకల తిమిర సన్నుత

శ్రీ శారదాంబా నమోస్తుతే
సంగీత సాహిత్య మూలాకృతే
శ్రీ శారదాంబా నమోస్తుతే
నమోస్తుతే 

 

2 comments:

ఆ అమ్మవారి కృప మీపై యెల్లప్పుడూ ఉండాలని ఆకాంక్ష..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.