శుక్రవారం, అక్టోబర్ 21, 2016

మజ్ను - కొన్ని పాటలు...

గోపీ సుందర్ కంపోజ్ చేసిన పాటల్లో కొన్ని మెలోడీస్ భలే ఉంటాయ్. తను రీసెంట్ గా చేసిన మజ్ను సినిమాకి అతని పాటలు నేపధ్య సంగీతం కూడా ప్లస్ అయ్యాయనడంలో సందేహం లేదు. ఆ సినిమాలో నాకు బాగా నచ్చిన మూడు పాటలు ఇక్కడ ఇస్తున్నాను. ఈ పాటలు ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మజ్ను (2016)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : శ్రీమణి
గానం : సుచిత్ సురేశన్

కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే
తనివి తీరా చూద్దామంటే పారిపోతావే

రాతిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే
తెల్లవారే ఎదురైవస్తే జారుకుంటావే
ఊరించకే ఊరించకే ఆ కొంటె చూపుతోటి నన్ను చంపకే
కవ్వించకే కవ్వించకే నీ నవ్వు తోటి మాయ చెయ్యకులే చెలియా

కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే
తనివి తీరా చూద్దామంటే పారిపోతావే

ఆ దొంగ చూపు హాజరేదో నాకు వేస్తావులే
ఎదురే ఉంటే చూడవులే
నే వెళిపోతుంటే నువ్వు తొంగి చూస్తావులే

నీ గుండెలోన ఎన్ని వేల ప్రేమ లేఖలో
నీ కళ్ళలోకి ఒక్కసారి చూస్తేనే తెలిసిందిలే

కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే
తనివి తీరా చూద్దామంటే పారిపోతావే

పుస్తకాలలో నువ్వు రాసుకున్న పేరేమిటో ఎగిరే పేజీ చెప్పిందే
నీ కదిలే పెదవే చిరు సాక్షమిచ్చిందిలే

నను నువ్వు దాటి వెళ్ళిపోవు తొందరెందుకో
నీ నీడ నిన్ను వీడి నాకు ఎదురొచ్చి చెప్పిందిలే

సిగ్గు నీకే చాలా అందం ... ముద్దు ముద్దుగ ఉంటావే
ఎంత ముద్దుగ ఉంటే మాత్రం అంత సిగ్గేంటే

ఎంత దాచాలనుకున్నావో అంత బయటే పడతావే
ఎంత మౌనం ఒలికేసావో అంత తెలిసావే
తెలిసిందిలే తెలిసిందిలే నీ మూగ కళ్ళలోని భావమేమిటో
దొరికిందిలే దొరికిందిలే నీ దొంగ నవ్వుకర్థమేమిటో ఇపుడే

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : మజ్ను (2016)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : రాంబాబు గోశాల
గానం : నరేష్ అయ్యర్

కల ఇదో నిజమిదో తెలియదే మరి ఎలా
జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా
పదమని నీ వైపు తరుముతోంది నన్నిలా
నామాట వినదు మనసు ఏంటిలా
కుదురుగ కాసేపు ఉండనీదులే ఇలా
పదే పదే ఇదే నీ వల్లనే

జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా
జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా

జోరే పెంచావె గుండె లయలలోన నువ్వే ఇలా
దారే మార్చావే ఏదో మాయ చేసేలా
వాలు కనులలోనా దాచేసినావా ఆ నింగిలోన లేదు నీలం
హాయి లోయలోనా తోసేసినావా ఇదేలే నీ ఇంద్రజాలం

జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా

నాపై వర్ణాల పూల జల్లులేవో కురిసేనులే
నేనే నీ నవ్వు తలచుకున్న వేళలో
చల్లగాలిలాగ నీ వూసులేవో మెల్లిగానె నన్ను గిల్లిపోయే
నీలి మబ్బులాగ నా ఆశలేవో పైపైన నింగిలోన తేలే

జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా
పదమని నీ వైపు తరుముతోంది నన్నిలా
నామాట వినదు మనసు ఏంటిలా
కుదురుగ కాసేపు ఉండనీదులే ఇలా
పదే పదే ఇదే నీ వల్లనే

జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : మజ్ను (2016)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : శ్రీమణి
గానం : చిన్మయి

ఓయ్.. మేఘంలా
తేలిందే నా చిన్ని మనసే
హే.. మిలమిలలా
మిణుగురులా మారింది వరసే
కనులకి ఈ రోజిలా అందంగా
లోకం కనిపించెనే నీవల్ల

చాలా బావుందే నీ వెంటుంటే
ఏదో అవుతుందే నీతోవుంటే

ఓయ్.. మేఘంలా
తేలిందే నా చిన్ని మనసే
హే...మిలమిలలా
మిణుగురులా మారింది వరసే

కళ్ళగంత కట్టినా
కళ్ళముందు వాలెనే
వింతలన్నీ నువ్వు పక్కనుంటే
పిల్లగాలి కూడా పాడుతోంది కొత్త పాటే
ఓ...ఓ...

ఎంత దూరమెళ్లినా
జంటకట్టి వచ్చేనే
కాలి గుర్తులన్నీ మనవెంటే
మండుటెండ వెండి వెన్నెలై పూసే

పెదవులు తెలియని రాగం తీసే
ఓ...ఓ...
తలుపులు తియ్యని కవితలు రాసే
ఒక ఆశే... విరబూసే
నా  మనసు  పలికేది నీ ఊసే

ఓయ్.. మేఘంలా
తేలిందే నా చిన్ని మనసే
హే...మిలమిలలా
మిణుగురులా మారింది వరసే

చెయ్యిపెట్టి ఆపనా
తిట్టికొట్టి ఆపనా
పరుగుపెట్టే ఈ నిమిషాన్ని
ఈ క్షణమే శాశ్వతమే అయిపోని
ఓ...ఓ...
వెళ్లనివ్వనంతగా హత్తుకున్నాయిగా
ఈ తీపి జ్ఞాపకాలన్నీ
ఊపిరున్నదాకా చిన్ని గుండె దాచిపెట్టుకోనీ

ఎంతని ఆపను నా ప్రాణాన్నీ హో
ఏమని దాచను నా హృదయాన్ని
నీతోనే చెప్పేయ్ నీ
ఈ బయట పడలేని మౌనాన్ని

ఓయ్...నీవల్లే
గువ్వల్లే ఎగిరింది మనసే
హే... ఈరోజే...
నా కలలో వుందెవరో తెలిసే
పుట్టిన ఇన్నాళ్లకా వచ్చేది
వేడుక ఇన్నేళ్లకా తెచ్చేది

చాలా బావుందే... నీ వెంటుంటే
ఏదో అవుతుందే.. నీతోవుంటే


2 comments:

మంచి పాట..భలే మూవీ అండి..మంచి టైంపాస్..నాకైతే ప్రేమం(విత్ డ్యూ రెస్పెక్ట్స్ టూ చైతు ఫాన్స్) కంటే ఈ మూవీయే బావుంది..

థాంక్స్ శాంతి గారు.. ఈ సినిమా అంత నచ్చేయడానికి కారణం నానీనే అండీ.. నాకూ చాలా నచ్చిన సినిమా ఇది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.