సోమవారం, అక్టోబర్ 10, 2016

ఓంకార నాదానుసంధానమౌ గానమే...

ఈ రోజు మహిషాసుర మర్ధిని అవతారంలో దుష్ట శిక్షణ గావించే దుర్గమ్మను చేతులెత్తి నమస్కరించి కాపాడమని వేడుకుంటూ శంకరాభరణం చిత్రంలోని ఒక చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో డౌన్లోడ్ అవ్వని వాళ్లు ఇక్కడ చూడవచ్చు.


 
చిత్రం : శంకరాభరణం (1980)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, జానకి 

ఓం... ఓం...
ఓంకార నాదానుసంధానమౌ గానమే.. శంకరాభరణము
ఓంకార నాదానుసంధానమౌ గానమే.. శంకరాభరణము
శంకరా భరణము...

శంకర గళ నిగళము... శ్రీహరి పద కమలమూ
శంకర గళ నిగళము... శ్రీహరి పద కమలమూ
రాగరత్న మాలికా తరళమూ.. శంకరాభరణమూ

శారద వీణా..... ఆ.....
శారద వీణా రాగ చంద్రికా.. పులకిత శారద రాత్రము
శారద వీణా రాగ చంద్రికా.. పులకిత శారద రాత్రము
నారద నీరద మహతీనినాద గమకిత శ్రావణ గీతము
నారద నీరద మహతీనినాద గమకిత శ్రావణ గీతము

రసికులకనురాగమై.. రసగంగలో తానమై
రసికులకనురాగమై.. రసగంగలో తానమై
పల్లవించు సామవేద మంత్రము
శంకరాభరణమూ శంకరా భరణమూ

అద్వైత సిద్ధికి.. అమరత్వ లబ్ధికి.. గానమె సొపానము
అద్వైత సిద్ధికి.. అమరత్వ లబ్ధికి.. గానమె సొపానము

సత్వ సాధనకు.. సత్య శోధనకు.. సంగీతమే ప్రాణమూ
సత్వ సాధనకు.. సత్య శోధనకు.. సంగీతమే ప్రాణమూ

త్యాగరాజ హృదయమై.. రాగరాజ నిలయమై
త్యాగరాజ హృదయమై.. రాగరాజ నిలయమై
ముక్తినొసగు భక్తి యోగ మార్గము
మృతియెలేని సుధాలాప స్వర్గము
శంకరాభరణమూ

ఓంకార నాదానుసంధానమౌగానమే శంకరాభరణమూ

పాదాని... శంకరాభరణము
పమగరి గమపదని.. శంకరాభరణము

సరిసా నిదప నిసరి దపమ గరిగ పమగ
పమద పనిద సనిగరి శంకరాభరణము
ఆహా

దపా దమా మాపాదపా... మాపాదపా
దపా దమా మదపామగా... మదపామగా
గమమదదనినిరి మదదనినిరిరిగ
నిరిరిగగమమద సరిరిససనినిదదప..
శంకరాభరణమూ

రీససాస రిరిసాస రీసాస సరిసరీస రిసరీస రీసనిద నీ నీ నీ
దాదనీని దదనీని దానీని దరిస 
దనిస దని దగరిసానిదప దా దా ద
గరిగా మమగా
గరిగా మమగా
గరి గమపగా మపద మదపమ గరిసరి సరిగసరీ
గరి మగపమదప
మగపమదప నిదపమదప నిదసనిదప నిదసనిరిస
గరీసా గరిసనిదరీసా రిసనిదపసా గరిసనిద నిసనిదప
సనిదపమ నీసాని
నిసనిదపనీదా సనిదపమపా
రిసనిదప సరిదపమ గమమగరి
గమదా
నిసనిపద మపా నిసనిదప నీ దపమగరి రిసనిదప
మగరిసరిసని...
శంకరాభరణము శంకరాభరణమూ

 

2 comments:

మహర్నవమి శుభాకాంక్షలు వెణూజీ..

థాంక్స్ శాంతి గారూ మీకు కూడా మహర్నవమి శుభాకాంక్షలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.