సోమవారం, నవంబర్ 23, 2015

జగదీశ్వరా పాహి పరమేశ్వరా..

కార్తీక సోమవార పర్వదినం సందర్బంగా ఆ లయ కారుడ్ని స్తుతించుకుంటూ సువర్ణసుందరి లోని ఈ చక్కని పాట గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : సువర్ణసుందరి(1957)
సంగీతం : ఆదినారాయణరావ్
రచన : సముద్రాల
గానం : సుశీల, కోరస్

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓం...నమశ్శివాయః సిద్ధం నమః ఓం...
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
దేవాపుర సంహార!..ధీర నటశేఖరా
త్రాహి కరుణాకరా..పాహి సురశేఖరా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..

శంభోహరా..వినుతలంబోధరా..
అంబావరకావరా..ఆ ఆ ఆ....
శంభోహరా..వినుతలంబోధరా..
అంబావరకావరా..
వరమీయరా..గౌరి..వరసుందరా
గౌరి..వరసుందరా..
నిన్నే కని మేము కొలిచేము..గంగాధరా
దేవ...గంగాధరా...
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..

ప్రధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ప్రధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..

నడిపెను సుందర నటనకు జతులిడ
నందియ మార్దళనాదమే..
మధురాతిమధుర శృతి గీతమే...
తధిమి..తధిమి ధిమితైతై తయ్యని
తాండవమాడేను..పాదమే..
మది సేవించిన సమ్మోదమే..
జగంబులా ఏలికా..శివకామ సుందర నాయకా
జగంబులా ఏలికా..శివకామ సుందర నాయకా

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ప్రమధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail