ఆదివారం, నవంబర్ 22, 2015

అలకలకు లాలీజో...

అల్లరి పిల్ల చిత్రం కోసం విద్యాసాగర్ గారు స్వర పరచిన ఓ హాయైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : అల్లరిపిల్ల (1992)
సంగీతం : విద్యాసాగర్
సాహిత్యం : 
గానం : మనో, లలిత

అలకలకు లాలీజో కులుకులకు లాలీజో.. 
అలకలకు లాలీజో కులుకులకు లాలీజో..
కలికి చిలక.. కలత పడక..
కలికి చిలక కలత పడక కలల ఒడి చేరాకా
ఆహా.. ఝంచకు.. ఆహా.. ఝంచకు..
కులుకులకు లాలీజో.. తళుకులకు లాలీజో..

జత కలిసినదొక తార జతులను పలుకు సితారా 
మతి చెడు సొగసులు ఔరా.. వెతికిన దొరకవులేరా.. 
స్వరాలలో కోయిలమ్మ సరాగమే ఆడగా 
పదే పదే కూనలమ్మ పదాలుగా పాడగా 
అండకోరి వచ్చెనమ్మ కొండపల్లి బొమ్మ 
గుండెలోన విచ్చెనమ్మ కొండమల్లి రెమ్మ 
పండులాగ దిండులాగ చెండులాగ ఉండిపోగ 
పండుగాయె పండు వెన్నెల.. 

ఆహా.. ఝంచకు.. ఆహా.. ఝంచకు..
కులుకులకు లాలీజో.. తళుకులకు లాలీజో..
ఝంచకు చకు ఝంచకు.. 
ఝంచకు చకు ఝంచకు.. 

ఉరుకుల పరుగుల జాణ దొరికిన సిరుల ఖజానా 
తొలకరి అలకలలోనా చిలికెను వలపులు మైనా 
మరీ ఇలా మారమైతే ఫలించునా కోరిక 
కథేమిటో తేలకుంటే లభించునా తారకా 
అందమంత విందు చేసె కుందనాల కొమ్మ 
ముందుకాళ్ళ బంధమేసే చందనాల చెమ్మ 
అందరాని చందమా అందుకూన్న పొందులోన 
నందనాలు చిందులెయ్యగా..

ఆహా.. ఝంచకు.. ఆహా.. ఝంచకు.. 
కులుకులకు లాలీజో.. తళుకులకు లాలీజో..
కులుకులకు లాలీజో.. తళుకులకు లాలీజో..
కలికి చిలక.. కలత పడక..
కలికి చిలక కలత పడక కలల ఒడి చేరాకా
ఆహా.. ఝంచకు.. ఆహా.. ఝంచకు..  
ఆహా.. ఝంచకు.. ఆహా.. ఝంచకు.. 

 
   

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail