సోమవారం, మార్చి 09, 2015

మై హార్ట్ ఈజ్ బీటింగ్...

తన శైలికి భిన్నంగా బోల్డు ఇంగ్లీష్ పదాలతో రాసి కుర్రకారు ఫీలింగ్స్ ని కళ్ళకు కట్టిన సిరివెన్నెల గారి పాట ఇది. ఇక దేవీ సంగీతం గురించీ త్రివిక్రమ్ టేకింగ్ గురించీ చెప్పేదేముంది చూసి ఆస్వాదించేయడమే. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జల్సా(2008)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కె.కె.

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మది

పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి
కనులలో వెతికితే దొరుకుతుందీ
టీ స్పూన్ టన్ను బరువవుతుందే
ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే
క్లౌడ్ 9 కాళ్ళకిందకొచ్చిందే
లాండ్ మైన్ గుండెలో పేలిందే దే.. దే..

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా
మునుపు లేని మైకానా మదిని ముంచి పోయిందా
ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా
సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే స్టెన్ గన్ మోగినట్టు ఉంటుందే
క్రాంప్టన్ ఫాను గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుందే దే.. దే..

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

ఎప్పుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే పదపదమని పడుచు రథం
యదలయలో ముదిరినదే మదనుడి చిలిపి రిథం
గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవనం
తహతహగా తరిమినదే దం అరె దం అని తూలే ఆనందం
ఫ్రీడం దొరికినట్టు గాలుల్లో వెల్ కం పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే దే.. దే..

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ


1 comments:

కొత్త పాటల్లో, మనసుని హత్తుకునే కొద్ది పాటల్లో..ఇదీ ఒకటి..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.