శుక్రవారం, మార్చి 13, 2015

నింగికి జాబిలి అందం...

చెలి చిత్రం కోసం హారీస్ జయరాజ్ స్వరపరచిన ఒక చక్కని గీతం ఈరోజు. అప్పట్లో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు రేపిన పాట ఇది. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చెలి (2001)
సంగీతం : హారీస్ జయరాజ్
సాహిత్యం : భువనచంద్ర
గానం : ఉన్నికృష్ణన్, హరిణి

నింగికి జాబిలి అందం నేలకి తొలకరి అందం
నీకనుచూపులు సోకటమే ఆనందం
బొమ్మా బొరుసుల చందం విడిపోనిది మన బంధం
కమ్మని కలల గోపురమే అనుబంధం.. అనుబంధం..
ఓ ఓ మౌనం మౌనం మౌనం మానవా ప్రాణమా
మాటిస్తే ప్రాణం నీకే ఇవ్వనా నేస్తమా

ఇతడెవరో ఇతడెవరో వచ్చినదెందుకనో
నా వెనకే వచ్చాడు దేనిని కోరుకునో
ఎమైందో నాకే తెలియదులే
గుండెల్లో గుబులూ తరగదులే
అరె ఏమిటిలా ఎందుకిలా తడబడి పోతున్నా
ఇది వలపు కథో వయసు వ్యధో తెలియక నించున్నా
 
ఇతడెవరో ఇతడెవరో వచ్చినదెందుకనో
నా వెనకే వచ్చాడు దేనిని కోరుకునో
ఎమైందో నాకే తెలియదులే
గుండెల్లో గుబులూ తరగదులే
అరె ఏమిటిలా ఎందుకిలా తడబడి పోతున్నా
ఇది వలపు కథో వయసు వ్యధో తెలియక నించున్నా

వయసుని తట్టి మనసుని పట్టే ముద్దుల జాబిల్లి
పోకే చెలియా నన్నొదిలి
నవ్వులు రువ్వి పువ్వులు రువ్వి ఆడకె దీవాలి
చెవిలో పాడకె ఖవ్వాలి
మనసా మనసా నిన్నూ మదిలో దాచినదెవరో..ఓ..
నా యదలోనే ఉంటూ నన్నే దోచినవారే

వారెవరో వారెవరో వచ్చినదెందుకనో
యదలోనే యదలోనే దాగినదెందుకనో
ఎమైందో నాకే తెలియదులె
గుండెల్లో గుబులూ తరగదులే
అరె ఏమిటిలా ఎందుకిలా తడబడి పోతున్నా
ఇది వలపు కథో వయసు వ్యధో తెలియక నించున్నా
అరె తికమక పడుతున్నా..

 
సొగసరి గువ్వ సోగసరి గువ్వ తడబాటెందులకే
తలపుల దాహం తీర్చవటే
మనసును మోహం కమ్ముకు వస్తే మౌనం వీడవటె
మదనుడి సాయం కోరవటే
ఏమో ఏమో నన్నూ ఏదో చేసావులే..ఏ..
నేను నీకు చేసిందేదో నువ్వే నాకు చెసావే బొమ్మా

నీవెవరో నీవెవరో ఒచ్చినదెందుకనో
నావెనకే పడ్డావు... ఊఁహూఁహూఁ..
 
నేనేలే నీకోసం వచ్చా మనసారా
నా ఎదనే నీకోసం పరిచా ప్రియమారా
ఎమైందో నాకే తెలియదులే నామనసు నిన్నే వీడదులే
అరె ఎందుకిలా ఎందుకిలా జరిగెనె ప్రాణసఖి
ఇది వలపు కథో వయసు వ్యధో తెలుపవే చంద్రముఖి
కథ తెలుపవే చంద్రముఖీ
కథ తెలుపవే చంద్రముఖీ
కథ తెలుపవే చంద్రముఖీ
చంద్రముఖీ చంద్రముఖీ చంద్రముఖీ..


1 comments:

వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్..హేరిస్ జైరాజ్..బట్ ఈ సాంగ్ సో, సో..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.