బుధవారం, మార్చి 11, 2015

మనసున మనసై...

డాక్టర్ చక్రవర్తి సినిమా కోసం సాలూరి వారి స్వరసారధ్యంలో విప్లవ కవి శ్రీశ్రీ రాసిన మనసు పాట ఇది. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : శ్రీ శ్రీ
గానం : ఘంటసాల

మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై
 
మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము
మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము

 
ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో..
 
తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము
 
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు...
నీ కోసమే కన్నీరు నించుటకు
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు...
నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే..
 
తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము
 
చెలిమియే కరువై వలపే అరుదై... 
చెదరిన హృదయమె శిలయై పోగా
నీ వ్యధ తేలిసీ నీడగ నిలిచే..
 
తోడొకరుండిన అదే భాగ్యమూ .. అదే స్వర్గము

మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము


1 comments:

ప్రపంచమంతా నిన్ను వెలివేసినా నీ పక్కన నుంచునే వాడే నిజమైన స్నేహితుడంటారు మన పెద్ద వాళ్ళు..ఈ సాహిత్యం విన్నప్పుడల్లా దాంపత్యమనేది యెంత అపురూపమైన స్నేహమో అనిపిస్తుంది..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.