శనివారం, మార్చి 14, 2015

ప్రేమయాత్రలకు బృందావనము...

ప్రేమయాత్రలకు బృందావనాలు నందనవనాలు ఎందుకు కులుకులొలుకు చెలి చెంతనుంటే స్వర్గం వేరే ఎక్కడో ఎందుకు ఉంటుంది అంటూ ఈ ప్రేమ జంట చెప్పే ముచ్చటలేమిటో మనమూ విందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : గుండమ్మ కథ (1962)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి నాగేంద్ర రావు
గానం : ఘంటసాల, సుశీల

ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
ఆహాహా ఆహాహా హా
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
తీర్ధయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలనో
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో
ఆహాహా ఆహాహా హా
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో
తీర్ధయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలనో

చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
ఆహాహా ఆహా ఆహాహా ఆహాహా హా
చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునే ఊటీశాయగా
ఆహాహా ఆహాహా హా
సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునే ఊటీశాయగా

ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలు ఏలనో

కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా
ఆహాహా ఆహా ఆహాహా ఆహాహా హా
కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా
ఆహాహా ఆహాహాహా
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా
తీర్ధయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ ఏలనో

అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
 

1 comments:

పాట గుడ్ గుడ్ కానీ..ప్రతీదానికీ లెక్కలేసుకునే బడ్జెట్ పద్మనాభం లాంటి భర్తలకు మాత్రం చూపించకూడదు సుమండీ..మళ్లీ మాట్లాడితే అసలు గుర్తే చెయ్యకూడదు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail