శనివారం, ఫిబ్రవరి 07, 2015

ఈ ఎర్రగులాబీ విరిసినది...

ప్రేమికులరోజు దగ్గర పడుతుంది కదా ఈరోజు నుండి ఒక వారం పాటు ప్రేమ గీతాలు పాడుకుందాం. ఎర్రగులాబీలు చిత్రం లోని ఈ పాట చాలా బాగుంటుంది. అసలు ప్రేమలోని వెచ్చదనానికీ గులాబీలోని ఎర్రదనానికీ మధ్య అనుబంధం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదుగా.. అందుకే ఈరోజు ఈ పాటతో మొదలుపెడుతున్నాను. ఇళయరాజా గారి సంగీతం ప్రేమికులని ఉర్రూతలూగిస్తుందీ పాటలో. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఎర్ర గులాబీలు (1979)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి 

రురూరురూ.. రురురురూ..
రురురురురురు..
 
ఎర్రగులాబీ విరిసినది
తొలిసారి నను కోరి
ఆశే రేపింది నాలో..
అందం తొణికింది నీలో..
స్వర్గం వెలిసింది భువిలో..

ఈ ఎర్రగులాబీ విరిసినది
తొలిసారి నిను కోరి
ఆశే రేపింది నీలో..
అందం తొణికింది నాలో..
స్వర్గం వెలిసింది భువిలో..
ఈ ఎర్రగులాబీ విరిసినదీ..

 
లతనై నీ జతనై నిన్నే పెనవేయనా
కతనై నీ కలనై నిన్నే మురిపించనా
నేనిక నీకే సొంతము 
న న న న న
నీకెందుకు ఈ అనుబంధము
న న న న న న న న న న న నా
 
ఈ ఎర్రగులాబీ విరిసినది
తొలిసారి నను కోరి
ఆశే రేపింది నీలో..
అందం తొణికింది నాలో..
స్వర్గం వెలిసింది భువిలో..
 
ఈ ఎర్రగులాబీ విరిసినది ..

పెదవిని.. ఈ మధువునూ నేడే చవిచూడనా
నాదని ఇక లేదనీ నీకే అందివ్వనా
వయసుని వయసే దోచేది
న న న న న న
అది మనసుని నేడే జరిగేది
న న న న న న న న న న న నా

ఈ ఎర్రగులాబీ విరిసినది
తొలిసారి నిను కోరి
 
ఆశే రేపింది నాలో..
అందం తొణికింది నీలో..
స్వర్గం వెలిసింది భువిలో..
ఈ ఎర్రగులాబీ విరిసినది..
నననన.. నననన..అహహా...
  

1 comments:

ఈ మూవీ సాంగ్స్ కోసమే చూశానండీ..పైగా సెకండ్ షో..పాటలంటే ఇప్పటికీ పిచ్చి..బట్ మువీ అంటేనే..అంటేనే..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.