గురువారం, ఫిబ్రవరి 19, 2015

ఒళ్ళంత వయ్యారమే..

ఇద్దరూ ఇద్దరే చిత్రంలోని ఒక హుషారైన పాట... చక్రవర్తి గారి టిపికల్ శైలిలో సాగే పాటను ఈ రోజు గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.


చిత్రం : ఇద్దరూ ఇద్దరే (1976 )
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు, సుశీల

ఒళ్ళంత వయ్యారమే పిల్లదానా..
ఒక చిన్న ముద్దియ్యవే కుర్రదానా
ఆహ..ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడా..
ఎవరైనా చూస్తారురా వన్నెకాడ..

అర్రెర్రెర్రె..రే ఒళ్ళంత వయ్యారమే పిల్లదానా..
ఒక చిన్న ముద్దియ్యవే ఓ..కుర్రదానా...
అమ్మమ్మమ్మా.. ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడా..
ఎవరైనా చూస్తారురా వన్నెకాడా..
ఆ.. ఊసులాడ.. చోటుకాదు..
ఆ చాటు ఉంది.. అందాల తోటలోన..
మందార చెట్టుకింద... నా ముద్దు చెల్లించవే..

ఓ..ఓ..ఓ..ఓ..ఒళ్ళంత వయ్యారమే పిల్లదానా..
ఒక చిన్న ముద్దియ్యవే ఓ....కుర్రదానా
హ్హ..హ్హా...హ్హా..హ్హా..ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడా..
ఎవరైనా చూస్తారురా వన్నెకాడ..

పువ్వల్లే నవ్వుతావు.. కవ్వించి కులుకుతావు..
పువ్వల్లే నవ్వుతావు.. కవ్వించి కులుకుతావు..
కులుకంతా కూరవండి.. మనసారా తినిపించాలీ..
ఆ..కులుకంతా కూరవండి.. మనసారా తినిపించాలీ...
హా..ఓ..ఓ..ఓ
రారాని వేళలోన రాజల్లే వస్తావు..
రారాని వేళలోన రాజల్లే వస్తావు..
ఏమేమో చేస్తావురా..అబ్బబ్బబా..
అందాల వాడలోన.. అద్దాల మేడలోన..
ఇద్దరమే ఉందామురా..

హో..హో..హో..ఒళ్ళంత వయ్యారమే పిల్లదానా..
ఒక చిన్న ముద్దియ్యవే ఓ....కుర్రదానా
అయ్యయ్యయ్యో.. ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడా..
ఎవరైనా చూస్తారురా వన్నెకాడ..

హో...మనసంతా మాలకట్టి.. మెడలోన వేస్తాను..
మనసంతా మాలకట్టి.. మెడలోన వేస్తాను..
మనువాడే రోజు దాక ఓరయ్యో.. ఆగలేవా
మనువాడే రోజు దాక ఓరయ్యో.. ఆగలేవా..ఓ..ఓ..ఓ...
అందాక ఆగలేనే.. నా వయసు ఊరుకోదే..
అందాక ఆగలేనే.. నా వయసు ఊరుకోదే..
వయ్యారి నన్నాపకే..హే..హే..హేయ్
అమ్మమ్మమ్మ.. పన్నీటి వాగు పక్క..
సంపంగి తోటలోన నీదాననవుతానురా..

ఓ..ఓ..ఓ..ఓ..ఒళ్ళంత వయ్యారమే పిల్లదానా..
ఒక చిన్న ముద్దియ్యవే కుర్రదానా
అమ్మమ్మమ్మా.. ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడా..
ఎవరైనా చూస్తారురా వన్నెకాడా..
ఆ..ఊసులాడ.. హా..చోటు కాదు..హా..
చాటు ఉంది.. అందాల తోటలోన..
మందార చెట్టుకింద.. నా ముద్దు చెల్లించవే..

ఓ..ఓ..ఓ..ఓ..ఒళ్ళంత వయ్యారమే పిల్లదానా..
ఒక చిన్న ముద్దియ్యవే ఓ....కుర్రదానా
అమ్మమ్మమ్మా..ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడా..
ఎవరైనా చూస్తారురా వన్నెకాడా.


1 comments:

పాట ఆడియోనే తప్ప, వీడియోకి అప్పట్లో పెర్మిషన్ లేదు ఇంట్లో..ఇప్పుడు పాతలు చూస్తుంటే..యెంత డీసెంట్ పాటిది..హన్నాన్నా..అనిపిస్తోంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.