సోమవారం, ఫిబ్రవరి 23, 2015

తెలుసుకొనవె యువతి..

నిన్న మిస్సమ్మ గారు ఓ అమ్మణ్ణికి చెప్పిన నీతులు విన్నారుగా ఈరోజు మరి ఈ కుర్రవాడెలా సమాధానం చెప్తున్నాడో వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : పింగళి 
గానం : ఏ. ఎం. రాజా

ఆఆఆఆ... ఆఆఆఅఆ... ఆఆఆఆఆ...

తెలుసుకొనవె యువతి.. అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి

యువకుల శాసించుటకే..
యువకుల శాసించుటకే యువతులవతరించిరని

తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి
 
సాధింపులు బెదరింపులు.. ముదితలకిక కూడవనీ
ఆ.ఆఆఆఆఆఅ.అ. అఆఆఆఅ...
సాధింపులు బెదరింపులు ముదితలకిక కూడవనీ
హృదయమిచ్చి పుచ్చుకొనే..
హృదయమిచ్చి పుచ్చుకొనే.. చదువేదో నేర్పాలని

తెలుసుకొనవె యువతి.. అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి
 
మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ 
ఆ.ఆఆఆఆఆఅ.అ. అఆఆఆఅ...
మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ
మగువలెపుడు మగవారిని
మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని

తెలుసుకొనవె యువతి.. అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి


1 comments:

"మగువలెపుడు మగవారిని చిరునవ్వున గెలవాలని"- ఇంతకంటే సమానత్వాన్ని చాటే వాక్యం మరొకటి ఉంటుందా..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.