మంగళవారం, ఫిబ్రవరి 17, 2015

నీలకంధరా దేవా...

మిత్రులందరకూ శివరాత్రి పర్వదినం సంధర్బంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ శుభదినాన భూకైలాస్ చిత్రంలోని ఈ పాటతో ఆ కైలాసనాధుని తలచుకుందామా. ఈ పాట నెమ్మదిగా సెలయేరులా మొదలై పోను పోనూ ఉరవడి పెరుగుతూ జలపాతమై ఎగసిపడి ముగుస్తుంది. విన్నప్పుడు ఒక్కో చరణానికి ఒక్కో విధంగా తనువు పులకించిపోతుంది. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్.సుదర్శనం
సాహిత్యం : సముద్రాల సీనియుర్ 
గానం : ఘంటసాల

జయ జయ మహాదేవ శంభో సదాశివా..
ఆశ్రితమందారా శృతిశిఖర సంచారా..ఆఅ...

నీలకంధరా దేవా దీనబాంధవా రారా నన్నుగావరా
నీలకంధరా దేవా దీనబాంధవా రారా నన్నుగావరా
సత్యసుందరా స్వామీ నిత్యనిర్మలా పాహీ
సత్యసుందరా స్వామీ నిత్యనిర్మలా పాహీ

నీలకంధరా దేవా 
దీనబాంధవా రారా నన్నుగావరా

అన్యదైవముగొలువా..ఆఆఅ..ఆఅఆ...
అన్యదైవమూ..గొలువా నీదుపాదమూ.. విడువా
అన్యదైవమూ..గొలువా నీదుపాదమూ.. విడువా
దర్శనమ్మునీరా మంగళాంగా గంగాధరా
దర్శనమ్మునీరా మంగళాంగా గంగాధరా

నీలకంధరా దేవా 
దీనబాంధవా రారా నన్నుగావరా

దేహియన వరములిడు దానగుణసీమా
పాహియన్నను ముక్తినిడు పరంధామా
నీమమున నీ దివ్యనామ సంస్మరణా
ఏమరక చేయుదును భవతాపహరణా
నీ దయామయ దృష్టి దురితమ్ములార
వరసుధావృష్టి నా వాంఛలీడేరా
కరుణించు పరమేశ దరహాసభాసా
హరహర మహాదేవ కైలాసావాసా... కైలాసావాసా

ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా
కన్నులవిందుగ భక్తవత్సల కానగ రావయ్యా
కన్నులవిందుగ భక్తవత్సల కానగ రావయ్యా
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా
ప్రేమమీర నీదు భక్తుని వూటను నిల్పవయా

ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా

శంకరా శివవంకరా అభయంకరా విజయంకరా
శంకరా శివవంకరా అభయంకరా విజయంకరా
శంకరా శివవంకరా అభయంకరా విజయంకరా

1 comments:

అమ్మావాళ్ళ టైంలో ఒక టికెట్ మీద రెండు సినిమాలు చూపించేవారట శివరాత్రికి..అందులో సాధారణంగా ఒక మూవీ ఇది ఉండేదట..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail