బుధవారం, ఫిబ్రవరి 18, 2015

ప్రియతమా తెలుసునా...

ఒక టైమ్ లో ఆర్పీ పట్నాయక్ పాటలు ఎంత బాగుండేవో.. తేజ,కులశేఖర్,ఇతను కలిసి ఇచ్చిన మెలోడీస్ ని ఎప్పటికీ మర్చిపోలేం అలాంటి ఓ అందమైన మెలోడి జయం చిత్రంలోని ఈ పాట. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జయం (2002)
సంగీతం : ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం : కులశేఖర్
గానం : ఆర్.పి. పట్నాయక్, ఉష

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
హృదయమా తెలుపనా నీకోసమే నేనని
కనుపాపలో రూపమే..నీవని
కనిపించని భావమే..ప్రేమని

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
ప్రియతమా తెలుసునా..

చిలిపి వలపు బహుశా హొహో
మన కథకు మొదలు తెలుసా హొహో
దుడుకు వయసు వరస హుహు
అరె ఎగిరిపడకే మనసా హుహు
మనసులో మాట చెవినెయ్యాలి సరసకే చేరవా
వయసులో చూసి అడుగెయ్యాలి సరసమే ఆపవా
నీకు సందేహమా..ఆఅ..ఆఅ..ఆహా..

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
ప్రియతమా తెలుసునా..

తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన

మనసు కనులు తెరిచా హొహో
మన కలల జడిలో అలిశా హొహో
చిగురు పెదవినడిగా హుహు
ప్రతి అణువు అణువు వెతికా హుహు
మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా
మనసులో భాష మనసుకు తెలుసు నన్నిలా నమ్మవా
ప్రేమ సందేశమా..ఆఅ..ఆఅ..ఆహా..

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
హృదయమా తెలుపనా నీకోసమే నేనని
కనుపాపలో రూపమే..నీవని
కనిపించని భావమే..ప్రేమని


1 comments:

నిజమేనండీ..బట్..పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రమన్నట్టు అన్ని పాటలూ తానే పాడేసి..చాలా త్వరగా జనానికి విరక్తి కలిగించేశారు ఆర్.పి..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.