శనివారం, ఫిబ్రవరి 28, 2015

గుండె గూటికి పండుగొచ్చింది...

ఎగిరే పావురమా చిత్రం లోని ఈ అందమైన పాటను ఉన్నికృష్ణన్, సునీతలు పాడడంతో ఆ అందం రెట్టింపైందని నాకు అనిపిస్తుంటుంది. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఎగిరే పావురమా (1997)సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డిసాహిత్యం : వేటూరిగానం : ఉన్నికృష్ణన్, సునీత గుండె గూటికి పండుగొచ్చింది పండు వెన్నెల పంచుతుందీమబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీనా ఇంట్లో దీపం పెడుతుందీ   గుండె గూటికి పండుగొచ్చింది.. పండు...

శుక్రవారం, ఫిబ్రవరి 27, 2015

ఓ సఖి.. ఒహో చెలి...

జగదేక వీరుని కథ సినిమాలోని ఒక చక్కని పాట ఈరోజు గుర్తుచేసుకుందాం. అన్నగారు ఎంత హాండ్సమ్ గా ఉంటారో ఈ పాటలో. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : జగదేకవీరుని కథ (1961)సంగీతం : పెండ్యాలసాహిత్యం : పింగళిగానం : ఘంటసాలఓ... దివ్య రమణులారా...నేటికి కనికరించినారా...కలకాదు కదా సఖులారా...ఓ సఖి.. ఒహో చెలి.. ఒహో మదీయ మోహినిఓ సఖి.. ఒహో చెలి.. ఒహో మదీయ మోహిని.. ఓసఖి...కలలోపల కనిపించి వలపించిన చెలులోహొ...ఓ...ఓ..కలలోపల...

గురువారం, ఫిబ్రవరి 26, 2015

మౌనమేలనోయి...

సాగరసంగమం చిత్రంలోని ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే కదా... ఇళయరాజా, వేటూరి, బాలు, జానకి, విశ్వనాథ్ గారు, జయప్రద, కమల్ వాహ్ ఎంతటి మేలు కలయిక.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : సాగర సంగమం (1982) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : బాలు, జానకి ఆఆఆఆఆఆఅ... మౌనమేలనోయి...మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయిమౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయిఎదలో వెన్నెల వెలిగే కన్నులఎదలో వెన్నెల...

బుధవారం, ఫిబ్రవరి 25, 2015

ఇంటింటి రామాయణం...

ఇంటింటి రామాయణం చిత్రం కోసం రాజన్ నాగేంద్ర గారు స్వరపరచిన ఒక సరదా అయిన పాట ఈరోజు గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.   చిత్రం : ఇంటింటి రామాయణం (1979)సంగీతం : రాజన్-నాగేంద్రసాహిత్యం : వేటూరిగానం : బాలు, సుశీలఇంటింటి రామాయణం.. వింతైన ప్రేమాయణంకలిసుంటే సల్లాపము.. విడిపోతే కల్లోలముఇంటింటి రామాయణం.. వింతైన ప్రేమాయణంకలిసుంటే సల్లాపము.. విడిపోతే కల్లోలము  సీతమ్మ చిలకమ్మ.....

మంగళవారం, ఫిబ్రవరి 24, 2015

కుడికన్ను అదిరెనే...

స్వరాభిషేకం సినిమా కోసం విశ్వనాథ్ గారు స్వయంగా రాసిన ఈ పాట విన్నారా.. అచ్చం అన్నమయ్య కీర్తనలా అనిపించే ఈ గీతానికి అంతే అద్భుతంగా స్వరాలందించినది పార్ధసారధి గారు. ఈ చిత్రానికి సంగితం అందించినది విద్యాసాగర్ గారు అయినప్పటికీ ఈ పాట ఒక్కటీ మాత్రం పార్ధసారధి గారు కంపోజ్ చేశారుట. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : స్వరాభిషేకం (2004) సంగీతం : పార్థసారధి (ఈపాటకు మాత్రమే) సాహిత్యం : కె.విశ్వనాథ్ గానం...

సోమవారం, ఫిబ్రవరి 23, 2015

తెలుసుకొనవె యువతి..

నిన్న మిస్సమ్మ గారు ఓ అమ్మణ్ణికి చెప్పిన నీతులు విన్నారుగా ఈరోజు మరి ఈ కుర్రవాడెలా సమాధానం చెప్తున్నాడో వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : మిస్సమ్మ (1955)సంగీతం : ఎస్. రాజేశ్వరరావుసాహిత్యం : పింగళి  గానం : ఏ. ఎం. రాజా ఆఆఆఆ... ఆఆఆఅఆ... ఆఆఆఆఆ...తెలుసుకొనవె యువతి.. అలా నడుచుకొనవె యువతీతెలుసుకొనవె యువతియువకుల శాసించుటకే..యువకుల శాసించుటకే యువతులవతరించిరనితెలుసుకొనవె యువతి...

ఆదివారం, ఫిబ్రవరి 22, 2015

తెలుసుకొనవే చెల్లి..

ఈ అక్కగారు తన చెల్లెలికి బోధిస్తున్న నీతులేవిటో మీరూ వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : మిస్సమ్మ (1955) సంగీతం : ఎస్.రాజేశ్వరరావు సాహిత్యం : పింగళి గానం : పి.లీల తెలుసుకొనవే చెల్లి.. అలా నడుచుకొనవే చెల్లీ తెలుసుకొనవే చెల్లి మగవారికి దూరముగ మగువలెపుడు మెలగాలని మగవారికి దూరముగ మగువలెపుడు మెలగాలని తెలుసుకొనవే చెల్లి.. అలా నడుచుకొనవే చెల్లీ తెలుసుకొనవే చెల్లి మనకు...

శనివారం, ఫిబ్రవరి 21, 2015

వాడుక మరచెద వేల...

పెళ్ళి కానుక చిత్రంలోని ఒక అందమైన పాట ఈరోజు గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : పెళ్లి కానుక (1960)సంగీతం : ఏ.ఎం.రాజసాహిత్యం : ఆచార్య ఆత్రేయగానం : ఏ. ఎం. రాజ, సుశీలవాడుక మరచెద వేల నను వేడుక చేసెద వేలనిను చూడని దినము నాకోక యుగమునీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజమువాడుక మరువను నేను నిను వేడుక చెయగ లేనునిను చూడని క్షణము నాకొక దినమునీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము  సంధ్య...

శుక్రవారం, ఫిబ్రవరి 20, 2015

ఒడుపున్న పిలుపు...

సిరిసిరిమువ్వలోని ఒక కమ్మనైన గీతం ఈరోజు తలచుకుందాం. మహదేవన్ గారి స్వరంలోనా, వేటూరి గారి పదాల్లోనా, బాలూ సుశీల ల స్వరాల్లోనా, విశ్వనాథ్ గారి చిత్రికరణలోనా ఈ పాటలోని కమ్మదనం ఎందులో ఎక్కువ ఉందో మీరేమైనా తేల్చుకోగలిగితే కాస్త నాక్కూడా చెప్పండి ప్లీజ్. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : సిరి సిరి మువ్వ (1978) సంగీతం : కె.వి. మహదేవన్ సాహిత్యం : వేటూరి గానం : బాలు, సుశీల   ఒడుపున్న...

గురువారం, ఫిబ్రవరి 19, 2015

ఒళ్ళంత వయ్యారమే..

ఇద్దరూ ఇద్దరే చిత్రంలోని ఒక హుషారైన పాట... చక్రవర్తి గారి టిపికల్ శైలిలో సాగే పాటను ఈ రోజు గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : ఇద్దరూ ఇద్దరే (1976 ) సంగీతం : చక్రవర్తి సాహిత్యం : ఆరుద్ర గానం : బాలు, సుశీల ఒళ్ళంత వయ్యారమే పిల్లదానా.. ఒక చిన్న ముద్దియ్యవే కుర్రదానా ఆహ..ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడా.. ఎవరైనా చూస్తారురా వన్నెకాడ.. అర్రెర్రెర్రె..రే ఒళ్ళంత వయ్యారమే పిల్లదానా.. ఒక చిన్న ముద్దియ్యవే...

బుధవారం, ఫిబ్రవరి 18, 2015

ప్రియతమా తెలుసునా...

ఒక టైమ్ లో ఆర్పీ పట్నాయక్ పాటలు ఎంత బాగుండేవో.. తేజ,కులశేఖర్,ఇతను కలిసి ఇచ్చిన మెలోడీస్ ని ఎప్పటికీ మర్చిపోలేం అలాంటి ఓ అందమైన మెలోడి జయం చిత్రంలోని ఈ పాట. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : జయం (2002) సంగీతం : ఆర్.పి. పట్నాయక్ సాహిత్యం : కులశేఖర్ గానం : ఆర్.పి. పట్నాయక్, ఉష ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీకోసమే నేనని కనుపాపలో రూపమే..నీవని కనిపించని భావమే..ప్రేమని...

మంగళవారం, ఫిబ్రవరి 17, 2015

నీలకంధరా దేవా...

మిత్రులందరకూ శివరాత్రి పర్వదినం సంధర్బంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ శుభదినాన భూకైలాస్ చిత్రంలోని ఈ పాటతో ఆ కైలాసనాధుని తలచుకుందామా. ఈ పాట నెమ్మదిగా సెలయేరులా మొదలై పోను పోనూ ఉరవడి పెరుగుతూ జలపాతమై ఎగసిపడి ముగుస్తుంది. విన్నప్పుడు ఒక్కో చరణానికి ఒక్కో విధంగా తనువు పులకించిపోతుంది. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : భూకైలాస్ (1958) సంగీతం : ఆర్.సుదర్శనం సాహిత్యం : సముద్రాల సీనియుర్  గానం...

సోమవారం, ఫిబ్రవరి 16, 2015

పదహారేళ్ళకూ నీలో నాలో...

బాలచందర్ గారి అద్భుత సృష్టి "మరో చరిత్ర" చిత్రం లోనుండి ఓ అందమైన పాటను ఈరోజు తలచుకుందాం.. జానకి గారు, ఆత్రేయగారు, ఎమ్మెస్ గారు, బాలచందర్ గారు ఈ నలుగురిలో ఎవరిని పొగడాలీ ఈ పాట వినేటప్పుడు అనేది నాకు ఎప్పుడూ కన్ఫూజనే... నాకు చాలా ఇష్టమైన పాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : మరోచరిత్ర (1978) సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్  సాహిత్యం : ఆత్రేయ  గానం :...

ఆదివారం, ఫిబ్రవరి 15, 2015

వద్దంటూనే నిన్ను వద్దంటూనే...

నిన్న ప్రేమికులరోజు బాగా సెలెబ్రేట్ చేస్కున్న వారంతా ఈ రోజు కూడా ఈ అమ్మాయిలా "ఐ యామ్ ఇన్ లవ్ బేబీ ఐ యామ్ ఇన్ లవ్" అని పాడుకుంటూ హాపీగా ఎంజాయ్ చేసేయండి. జిబ్రాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ కొత్తపాట నా ప్లేలిస్ట్ లో వెంటనే చోటు సంపాదించేసుకుంది. తన మెలోడియస్ ట్యూన్ కు చిన్మయి స్వరం కూడా ఎంత బాగా సూటయిందో... రామజోగయ్య శాస్త్రిగారు బాగా రాశారీ పాటను. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : రన్ రాజా...

శనివారం, ఫిబ్రవరి 14, 2015

ప్రేమికులరోజు శుభాకాంక్షలు...

ప్రేమికులందరికీ ప్రేమికులరోజు శుభాకాంక్షలు. ఈ స్పెషల్ డే సందర్బంగా దూకుడు చిత్రంలోని ఒక చక్కని పాట తలచుకుందాం. ప్రేయసి తొలిసారిగా కనిపించిన క్షణాలను అపురూపంగా గుర్తుంచుకుని ఆ క్షణం నుండీ తన జీవితం ఎంత మారిపొయిందో దానిపై ఆ అమ్మాయి ప్రభావం ఎంత ఉందో ఎంతా బాగా చెప్తున్నాడో ఈ ప్రేమికుడు మీరూ వినండి. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : దూకుడు (2011)సంగీతం : ఎస్. ఎస్. తమన్సాహిత్యం : రామజోగయ్య...

శుక్రవారం, ఫిబ్రవరి 13, 2015

నీలో వలపుల సుగంధం...

బాలచందర్ గారు, ఎమ్మెస్ విశ్వనాథన్ గారు, ఆత్రేయగారు కలిసి సృష్టించిన ఈ ప్రేమగీతం వినడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కనులకు వెలుగైనా కలలకు విలువైనా నువ్వేనని ఆమె అంటే మల్లెల జల్లులూ వెన్నెల నవ్వులూ ఎందుకు మదిలో నువ్వుంటే చాలని అతనంటున్నాడు. మాకిక లోకంతో పనిలేదంటూ ఒకరికొకరుగా ఈ ఇద్దరూ ఎంత హాయిగా పాడుకుంటున్నారో మీరే వినండి. ఈ పాట వీడియో దొరకలేదు ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : కోకిలమ్మ (1983)సంగీతం :...

గురువారం, ఫిబ్రవరి 12, 2015

వాలు కనుల దానా...

ఏ.ఆర్.రెహ్మాన్ స్వర సారధ్యంలో ఉన్నిమీనన్ గానం చేసిన ఈ పాట ప్రేమలో పడ్డాక ఒక ప్రేమికుడి అవస్థను కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది... ఆ ప్రేమ అతనిని ఎన్ని ఇబ్బందులు పెడుతుందో.. తన ప్రియురాలు తనకెంత అందంగా అపురూపంగా కనపడుతుందో వర్ణిస్తూ సాగే ఈ పాట నాకు చాలా ఇష్టం. మీరూ చూసీ విని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : ప్రెమికులరోజు (1999)  సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్  సాహిత్యం...

బుధవారం, ఫిబ్రవరి 11, 2015

నీ పిలుపే ప్రేమగీతం...

చూడకుండా ప్రేమించుకోవడమనే ట్రెండ్ ను పాపులర్ చేసిన "ప్రేమలేఖ" చిత్రంలో ప్రేమను గురించి తెలిపే ఒక చక్కని పాట ఇది. డబ్బింగ్ పాటే అయినా కూడా భువన చంద్ర గారు చక్కని సాహిత్యాన్నిచ్చారు. దేవా సంగీతం బాగుంటుంది. పాట చిత్రీకరణలో మొదట్లో వచ్చే పక్షుల జంట నేపధ్యానికి తగినట్లు భలే ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ప్రేమలేఖ (1996)సంగీతం : దేవాసాహిత్యం : భువనచంద్రగానం : ఉన్నికృష్ణన్ , చిత్రనీ...

మంగళవారం, ఫిబ్రవరి 10, 2015

ప్రతిదినం నీ దర్శనం...

వంశీ ఇళయరాజా గారి కాంబినేషన్ లో చాలా కాలం గ్యాప్ తర్వాత వచ్చిన ఈపాట ప్రారంభంలో వచ్చే ఆలాపన తోనే సంగీతాభిమానుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించేసుకుంటుంది. ఇక పాట మొత్తం స్వరం సాగిన తీరు అది ఉన్ని కృష్ణన్, శ్రేయా ఘోషల్ లు పాడిన తీరు, ఇంత అందమైన పాటను వంశీగారు చిత్రీకరించిన తీరు అన్నీ వేటికవే సాటి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అనుమానాస్పదం (2007) సంగీతం : ఇళయరాజా  సాహిత్యం :...

సోమవారం, ఫిబ్రవరి 09, 2015

నీ నీడనా ఇలా నడవనా...

రెండక్షరాల ప్రేమని వ్యక్తం చేయడానికి ఒకోసారి ఎన్ని మాటలైనా సరిపోవనిపిస్తుంది.. కానీ అదే ప్రేమ ఒకోసారి మౌనంగా కూడా వేలమాటలకు అందని భావాన్ని వ్యక్తపరచగలదు. మల్లెలతీరం చిత్రంలోని ఈపాటను చూడండి ఈ అమ్మాయి తన ప్రేమనంతా రెండేలైన్లలో ఎంత చక్కగా చెప్పిందో. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు (2013)సంగీతం : పవన్ కుమార్ సాహిత్యం : ఉమామహేశ్వర్రావుగానం : ప్రణవినీ నీడనాఇలా...

ఆదివారం, ఫిబ్రవరి 08, 2015

కోకిలా.. కొ క్కొ కోకిల...

గీతాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన కోకిల చిత్రంలోని ఈ పాట నా ఫేవరెట్ సాంగ్స్ లో ఒకటి. ఇళయరాజా గారి ట్యూన్ సింపుల్ గా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఐలవ్యూ అని వచ్చే లైన్ సింప్లీ సూపర్బ్... అండ్ మధ్యలో వచ్చే కొమ్మా పండే లైన్స్ కూడా చక్కని ఫోక్ ట్యూన్ లో భలే ఆకట్టుకుంటాయి. ఈ పాట చిత్రీకరణ కూడా నాకు చాలా ఇష్టం పచ్చని లాండ్ స్కేప్స్ లో అందంగా తీసిన గీతాకృష్ణ చిత్రీకరణలో అక్కడక్కడ వంశీ మార్క్ కనిపిస్తుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.