సోమవారం, జనవరి 26, 2015

భారత మాతకు జేజేలు...

మిత్రులందరకూ భారత రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. రామారావు గారి సినిమాలలో ఆయన గెటప్ పరంగా నాకు బాగా నచ్చే సినిమా బడిపంతులు. అందులోని ఒక చక్కని దేశభక్తి గీతాన్ని నేడు గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : బడి పంతులు (1972)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, బృందం

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు 
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ
 
త్రివేణి సంగమ పవిత్రభూమి 
నాల్గు వేదములు పుట్టిన భూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి 
త్రివేణి సంగమ పవిత్రభూమి 
నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి 
పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి
 
భారత మాతకు జేజేలు 
బంగరు భూమికి జేజేలు
 
శాంతిదూతగా వెలసిన బాపూ
జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ 
జాతి రత్నమై వెలిగిన వెహ్రూ 
విప్లవ వీరులు వీర మాతలు 
విప్లవ వీరులు వీర మాతలు 
ముద్దుబిడ్డలై మురిసే భూమి ..

భారత మాతకు జేజేలు 
బంగరు భూమికి జేజేలు
 
సహజీవనము సమభావనము 
సమతా వాదము వేదముగా
సమతా వాదము వేదముగా 
సహజీవనము సమభావనము 
సమతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము 
లక్ష్యములైన విలక్షణ భూమి
లక్ష్యములైన విలక్షణ భూమి
 
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ


2 comments:

రాసిన, తీసిన, పాడిన, స్వర పరచిన మహామహులందరికీ జేజేలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail