శనివారం, జనవరి 31, 2015

అమ్మాయే సన్నగ...

ఖుషి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఖుషి (2001)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : చంద్రబోస్
గానం : ఉదిత్ నారాయణ్, కవితా సుబ్రహ్మణ్యం

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే
అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే

అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులు ఈ చూపులు
ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే

ప్రేమలు పుట్టె వేళ పగలంత రేయేలే
ప్రేమలు పండె వేళ జగమంత జాతరలే
ప్రేమే తోడుంటె పామైన తాడేలే
ప్రేమే వెంటుంటె రాయైన పరుపేలే
నీ ఒంట్లో ముచ్చెమటైన నా పాలిట పన్నీరే
నువ్విచ్చె పచ్చి మిరపైన నా నోటికి నారింజె
ఈ వయసులో ఈ వరసలో
ఈ వయసులో ఈ వరసలో నిప్పైనా నీరేలే

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే

నేనొక పుస్తకమైతే నీ రూపె ముఖ చిత్రం
నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్ధం
యెగిరె నీ పైటె కలిగించె సంచలనం
ఒలికే నీ వలపె చెయ్యించె తలస్నానం
యెండల్లొ నీరెండల్లో నీ చెలిమె చలివేంద్రం
మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపె రవి కిరణం
పులకింతలె మొలకెత్తగ
పులకింతలే మొలకెత్తగ ఇది వలపుల వ్యవసాయం

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులు ఈ చూపులు
ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే


1 comments:

ఆ అమ్మాయే కాదు..ఈ అబ్బయి నవ్వినా మతి తప్పక తప్పదండీ..ఆ పేరులో వైబ్రేషన్స్ అటువంటివి మరి..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail