ఆదివారం, జనవరి 11, 2015

విన్నారా.. అలనాటి వేణుగానం...

రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో ఘంటసాలగారు సుశీలగారు గానం చేసిన ఆరుద్ర వారి రచన ఈ రోజు గుర్తుచేసుకుందాం. ఒక సాంఘీక చిత్రంలో హీరో తత్వాన్ని కృష్ణ తత్వంతో పోలుస్తూ రాసిన ఈపాట చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.


చిత్రం : దేవుడు చేసిన మనుషులు (1973)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల, సుశీల

మరల రేపల్లెవాడలో.. మురళి మోగె
మోడువారిన హృదయాలు పూయసాగె..

విన్నారా..  విన్నారా..
అలనాటి వేణుగానం మోగింది మరల..
అలనాటి వేణుగానం మోగింది మరల
చెలరేగే మురళీ సుధలు..
తలపించును కృష్ణుని కథలు..  విన్నారా

పుట్టింది ఎంతో గొప్పవంశం..
పెరిగింది ఏదో మరో లోకం
పుట్టింది ఎంతో గొప్పవంశం.. 
పెరిగింది ఏదో మరో లోకం
అడుగడుగున గండాలైనా
ఎదురీది బతికాడు
అడుగడుగున గండాలైనా
ఎదురీది బతికాడు
చిలిపి చిలిపి దొంగతనాలు
చిననాడే మరిగాడు
దొంగైనా.. దొర అయినా..
మనసే హరించేనులే   

విన్నారా..
అలనాటి వేణుగానం మోగింది మరల
అలనాటి వేణుగానం.. మోగింది మరల

ద్వేషించే కూటమిలోన నిలచి.. 
ప్రేమించే మనిషేకదా మనిషి
ద్వేషించే కూటమిలోన నిలచి.. 
ప్రేమించే మనిషేకదా మనిషి
ఆడేది నాటకమైనా
పరుల మేలు  తలచాడు
ఆడేది నాటకమైనా
పరుల మేలు  తలచాడు
అందరికీ ఆనందాల
బృందావని నిలిపాడు
ఆ నాడు..  ఈ నాడు మమతే తరించేనులే 

విన్నారా.. 
అలనాటి వేణుగానం మోగింది మరల
చెలరేగే మురళీ సుధలు..
తలపించును కృష్ణుని కథలు..  విన్నారా


1 comments:

కరుణ రసం అణూవణువునా తొణికిసలాడే పాట..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.