శనివారం, జనవరి 24, 2015

హాయిగా ఆలుమగలై...

మాంగల్య బలం చిత్రంకోసం మాస్టర్ వేణు స్వరసారధ్యంలో శ్రీశ్రీ గారు రచించిన ఒక చక్కని పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : సుశీల, సరోజిని
 
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి

సతి ధర్మం పతి సేవేయని పతి భక్తిని చూపాలి
అనుదినము అత్త మామల పరిచర్యలనే చేయాలి
పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి
పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి
పదిమంది నీ సుగుణాలే పలుమార్లు పొగడాలి

హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
 
ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడు తెలియాలి
సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి
శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి
శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి
సుఖమైనా అసత్యమైనా సగపాలుగా మెలగాలి

హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
 
ఇరుగమ్మలు పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు
చీరలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగద్దు
అత్తింటను అదిరిపాటుతో పుట్టింటిని పొగడద్దు
అత్తింటను అదిరిపాటుతో పుట్టింటిని పొగడద్దు
తరుణం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవద్దు

హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail