బుధవారం, ఆగస్టు 27, 2014

మనసు పలికే...

ఇళయరాజా, విశ్వనాథ్ గారి కలయిక గురించి చెప్పేదేముంది... నాకు నచ్చిన ఈ పాట మీరూ చూసి విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : స్వాతి ముత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

మనసు పలికే... మనసు పలికే
మౌనగీతం... మౌనగీతం
మనసు పలికే మౌనగీతం నేడే
మమతలొలికే... మమతలొలికే
స్వాతిముత్యం... స్వాతిముత్యం
మమతలొలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయమధువు
తనువు సుమ ధనువు

మనసు పలికే మౌనగీతం నేడే
మమతలొలికే స్వాతిముత్యం నీవే

శిరసుపైని గంగనై మరుల జలకాలాడనీ
 మరుల జలకాలాడనీ...
సగము మేను గిరిజనై పగలు రేయీ ఒదగనీ
పగలు రేయీ ఒదగనీ...
హృదయ మేళనలో మధురలాలనలో

 హృదయ మేళనలో మధురలాలనలో
వెలిగిపోనీ రాగదీపం...
వెలిగిపోనీ రాగదీపం వేయిజన్మలుగా

 
మనసు పలికే మౌనగీతం నేడే
మమతలొలికే స్వాతిముత్యం నీవే
  
కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దనీ
 ఓనమాలు దిద్దనీ...
పెదవిపై నీ ముద్దునై మొదటి తీపి అద్దనీ
మొదటి తీపి...
లలితయామినిలో కలల కౌముదిలో 

 లలితయామినిలో కలల కౌముదిలో
కరిగిపోనీ కాలమంతా
కరిగిపోనీ కాలమంతా కౌగిలింతలుగా  

  
మనసు పలికే... మనసు పలికే
మౌనగీతం... మౌనగీతం
మనసు పలికే మౌనగీతం నేడే
మమతలొలికే... మమతలొలికే
స్వాతిముత్యం... స్వాతిముత్యం
మమతలొలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయమధువు
తనువు సుమ ధనువు

 

4 comments:

ఈ పాట రాసింది వేటూరి కాదు, నారాయణరెడ్డి. స్వాతిముత్యంలో వేటూరి రాయలేదు. సరి చేయగలరు

థాంక్స్ అజ్ఞాత గారు... సరిచేశాను.

హ్యూమన్ యెమోషన్స్ ని సున్నితం గా యెలివేట్ చెయ్యటం లో విశ్వనాధ్ గారు దీ బెస్ట్ కదండీ..

అవును శాంతి గారు కరెక్ట్.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.