శనివారం, మే 31, 2014

మనోహర నా హృదయమునే...

ఒక పదేళ్ళ క్రితం అప్పటి కుర్రకారుని ఒక ఊపు ఊపేసిన పాట... ఇప్పటికీ వింటూంటే మైమరపుతో మనసును ఏ దూరతీరాలకో పరుగులెత్తించే పాట... నాకు చాలా ఇష్టమైన పాట... మీరూ ఆస్వాదించండి.. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : చెలి (2001) సంగీతం : హరీష్ జయరాజ్ రచన : భువనచంద్ర గానం : బాంబే జయశ్రీ మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట మనోహర నా హృదయమునే ఓ మధువనిగా...

శుక్రవారం, మే 30, 2014

వసంతగాలికి వలపులు రేగ...

బాలమురళీ కృష్ణ గారు పాడిన అరుదైన సినిమా పాటలలో ఓ చక్కని ప్రేమగీతం ఇది. వారితో కలిసి యుగళగీతం పాడే అవకాశం దొరకడం జానకి గారి అదృష్టమేనేమో... ఎన్టీఆర్, జమున లపై చిత్రీకరించిన ఈ చక్కని పాట మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966) సంగీతం : పెండ్యాల  సాహిత్యం : పింగళి నాగేంద్రరావు గానం : మంగళంపల్లి బాలమురళీకృష్ణ, జానకి  ఆఆఅ....ఆఆఆఅ... ఆఆఆఆ.... వసంతగాలికి...

గురువారం, మే 29, 2014

ఏమో ఏమో ఇది...

రాజన్-నాగేంద్ర గారి స్వరకల్పనలో సినారే గారి రచన సింపుల్ అండ్ స్వీట్ సాంగ్ మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.   చిత్రం : అగ్గి పిడుగు (1964) సంగీతం : రాజన్-నాగేంద్ర సాహిత్యం : సినారె గానం : ఘంటసాల, జానకి ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది ఏమో ఏమో అది... నీకేమి ఏమి అయినది ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులౌతున్నది హాయ్... ఏమో ఏమో...

బుధవారం, మే 28, 2014

పువ్వై పుట్టి పూజే చేసి...

భారతీరాజా గారు తీసిన 'రాగమాలిక' సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరచిన మరో చక్కని పాట ఇది. వేటూరి గారి సాహిత్యం చాలా అందంగా ఉంటుంది ముఖ్యంగా మొదటి చరణం నాకు చాలా ఇష్టం. తమిళ్ వీడియో ఎంబెడ్ చేస్తున్నాను, తెలుగు ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : రాగమాలిక (1982)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : వేటూరిగానం : బాలు పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీపువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీపువ్వుగా ప్రాణాలు పోనీ తావిగా...

మంగళవారం, మే 27, 2014

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే...

చిరంజీవి సినిమాల్లోని ఎవర్ గ్రీన్ సాంగ్స్ లో ఇదీ ఒకటి, వేటూరి ఇళయరాజా గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట ఈరోజు విన్నా కూడా ఫ్రెష్ గానే ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అభిలాష (1983)  సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : బాలు, జానకి బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతీ...

సోమవారం, మే 26, 2014

ఈ నల్లని రాలలో...

ఎస్.రాజేశ్వరరావు గారి మరో ఆణిముత్యం సినారె గారి రచనలో... మీరూ తనివితీరా ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అమరశిల్పి జక్కన (1964) సంగీతం : ఎస్ రాజేశ్వరరావు సాహిత్యం : సినారె  గానం : ఘంటసాల ఈ నల్లని రాలలోఏ కన్నులు దాగెనోఈ బండల మాటునాఏ గుండెలు మ్రోగెనో ఈ నల్లని రాలలోపాపాలకు తాపాలకుబహుదూరములో నున్నవి పాపాలకు తాపాలకుబహుదూరములో నున్నవి మునులవోలె కారడవులమూలలందు పడియున్నవి...

ఆదివారం, మే 25, 2014

ఉప్పెనంత ఈ ప్రేమకీ...

దేవీశ్రీ, బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మరో అధ్బుతమైన పాట ఇది. ఈపాటకి మొదట్లోనూ తర్వాత పాట మధ్యలోనూ వచ్చే సిగ్నేచర్ గిటార్ బిట్ చాలా బాగుంటుంది. చిత్రీకరణ అల్లూ అర్జున్ డాన్స్ కూడా ఈ పాటలో హైలైట్. మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఆర్య-2 (2009) సంగీతం : దేవిశ్రీ ప్రసాద్సాహిత్యం : బాలాజిగానం: కె.కెఉప్పెనంత ఈ ప్రేమకీ .. గుప్పెడంత గుండె ఏమిటోచెప్పలేని ఈ హాయికీ...

శనివారం, మే 24, 2014

సుందరమో సుమధురమో...

అమావాస్య చంద్రుడు సినిమా కోసం ఇళయరాజా గారి స్వరకల్పనలో వేటూరి గారు రాసిన ఈపాట నాకు బోలెడు ఇష్టం అన్న ఒక్క మాట తప్ప ఇంకేం చెప్పినా తక్కువే... ఇంత చక్కని పల్లవిని వేటూరి గారు అలవోకగా రాజా గారు ట్యూన్ చెప్పిన మరుక్షణమే చెప్పేశారంటే ఆ మహాకవి గొప్పదనాన్ని ఏం చెప్పగలం. ఆ పల్లవి విన్న రాజా గారూ కూడా "ఆహా! సుందరత్తెలుంగు అని భారతి మహాకవి ఎందుకన్నాడో ఇప్పుడు తెలిసింది” అంటూ వేటూరి గారిని మెచ్చుకున్నారుట. పాటకు ముందు బాలలు కోరస్ గా పాడే "సరిగమపదని.."...

శుక్రవారం, మే 23, 2014

అదే నీవు అదే నేను...

విడుదలకు ముందే అవార్డులను సొంతం చేసుకున్న చిత్రం "అభినందన" లోని ఈపాట విషాద గీతమైనా కూడా ఈ సినిమాలోని మిగిలిన విషాద గీతాలతో పోలిస్తే కాస్త నయమే అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టమైన ఈ పాట మీరూ వినండి.  ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అభినందన (1988)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : ఆచార్య ఆత్రేయగానం: బాలుఆ హా హా హా....ఆ ఆ ఆ....ఆ....అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనాఅదే నీవు అదే నేను .. అదే గీతం...

గురువారం, మే 22, 2014

ఫీల్ మై లవ్...

దేవీశ్రీప్రసాద్ పాటలలో సాథారణంగా బోలెడు ఎనర్జీ ఉన్నాకూడా తను అల్లూఅర్జున్ కోసం కంపోజ్ చేసేప్పుడు మాత్రం ఏదో ప్రత్యేకమైన ఎనర్జీని నింపుకుని కంపోజ్ చేస్తాడనిపిస్తుంది. వాళ్ళ కాంబినేషన్ లో మాస్ బీట్ అయినా క్లాస్ ఫీల్ ఉండే సాంగ్ అయినా చాలా అద్భుతంగా కలకాలం నిలిచిపోయే రేంజ్ కి వస్తుంది. అలాటిది వారిద్దరికి సుకుమార్ చిత్రీకరణ కూడా తోడైతే ఆ పాట ఎప్పుడు విన్నా చూసినా కొత్తగానే అనిపిస్తుంటుంది. వారి కాంబినేషన్ లో వచ్చిన ఈ పాటని మీరూ చూసీ వినీ ఆస్వాదించండి....

బుధవారం, మే 21, 2014

నా హృదయంలో నిదురించే చెలీ...

ఎస్. రాజేశ్వరరావు గారి పాటలోని మాధుర్యం గురించి నేను చెప్పగలిగేటంతటి వాడనా అందులో ఈ పాట గురించి. చిన్న తనంలో మాస్ పాటలకు స్టెప్పులు వేసే రోజుల్లోనే ఎప్పుడైనా ఈ పాట రేడియోలో వినిపిస్తే మౌనంగా వినేసి చివర్లో అచ్చం ఈ హీరోయిన్ లాగానే చప్పట్లు కొట్టేసే వాళ్ళం. ఈ చక్కని పాటని మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఆరాధన(1962)సంగీతం : ఎస్.రాజేశ్వరరావు సాహిత్యం : శ్రీశ్రీగానం : ఘంటసాలనా...

మంగళవారం, మే 20, 2014

నీ నవ్వుల తెల్లదనాన్ని...

మణిశర్మ సంగీత దర్శకత్వంలో చంద్రబోస్ రచనతో వచ్చిన ఈపాట ప్రియురాలిని పొగడడంలో పీక్స్ కి వెళ్ళి పోతుంది, దానికి తోడు మంచి మెలోడీ కూడా అవడంతో విన్నవెంటనే ఆకట్టుకుంటుంది. ఈ సినిమా విడుదలైనపుడు నేను చాలా ఎక్కువగా విన్న ఈపాట మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఆది (2002)సంగీతం : మణి శర్మరచన : చంద్రబోస్గానం : మల్లికార్జున్, సునీతనీ నవ్వుల తెల్లదనాన్నిఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...నీ...

సోమవారం, మే 19, 2014

చిరు చిరు చినుకై కురిశావే...

ఆవారా సినిమా కోసం యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ఈ పాట నిజంగా చిరు జల్లుకురిసినంత ఆహ్లాదంగా హాయిగా సాగిపోతుంది నాకు చాలా ఇష్టమైన పాట. మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఆవారా సంగీతం : యువన్ శంకర్ రాజా సాహిత్యం : చంద్రబోస్  గానం : హరి చరణ్  చిరు చిరు చిరు చినుకై కురిశావే ఏ..ఏ.యే..యే.. మరుక్షణమున మరుగై పోయవే.... ఏ..ఏ.యే..యే.. నువ్వే ప్రేమబాణం.. నువ్వే...

ఆదివారం, మే 18, 2014

తలచి తలచి చూస్తే...

ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా చేసిన మాంచి మెలోడీ ఇది, విషాద గీతమైనా కూడా నాకు చాలా ఇష్టం అదీకాక శ్రేయా ఘోషల్ పాడిన పాట కనుక నచ్చకుండా ఎలా ఉంటుంది. ఈ అందమైన పాటను మీరూ వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : 7/G బృందావన్ కాలని (2004)సంగీతం : యువన్ శంకర్ రాజసాహిత్యం : శివగణేష్, ఏ.ఎం రత్నంగానం : శ్రేయా ఘోషల్తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తానీకై నేను బ్రతికే ఉంటినీఓ... నీలో నన్ను చూసుకొంటినీతెరిచి...

శనివారం, మే 17, 2014

దేశమ్ము మారిందోయ్...

ఈ ఎన్నికలలో చక్కని తీర్పు చెప్పిన ఓటరులకు హృదయపూర్వక అభినందనలు. అలాగే విజయం సాధించిన విజేతలందరకూ ముఖ్యంగా మోడీ, చంద్రబాబులకు అభినందనలు. వారి వారి నాయకత్వంపై నమ్మకముంచి "కష్టాలు తీరేనోయి... సుఖాలు నీవేనోయి.." అని పాడుకుంటూ ఓట్లు వేసి గెలిపించిన దేశ, రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పారదర్శకమైన పరిపాలనను అందించి దేశాభ్యుదయానికి రాష్ట్ర పునర్నిర్మాణానికి పాటుపడతారని ఆశిస్తున్నాను.  కేవలం సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంతోనే సరిపోలేదంటూ...

శుక్రవారం, మే 16, 2014

చిరుగాలి వీచెనే...

ఇళయరాజా గారి సంగీతంలోని మాజిక్ ని మరోసారి రుచి చూపించిన పాట ఇది. ఈ పాట పాడే ఆవకాశం రావడం ఆర్పీ.పట్నాయక్ చేసుకున్న అదృష్టం అని చెప్పచ్చేమో. అలాగే ఈ పాటే వనమాలికి మంచి రచయితగా గుర్తింపు తీసుకువచ్చిన పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఆర్పీ వర్షన్ ఇక్కడ సునీత,ఆర్పీ కలిసి పాడిన వర్షన్ ఇక్కడ వినవచ్చు (లిరిక్స్ రెండిటికీ ఒకటే) లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శివపుత్రుడు (2004)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : వనమాలిగానం : ఆర్పీ.పట్నాయక్చిరుగాలి...

గురువారం, మే 15, 2014

చెలికాడు నిన్నే రమ్మని పిలువా

ఎస్.రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో సినారె గారు రచించిన ఒక సరదా అయిన ఆపాతమధురం ఈ రోజు మీకోసం... చూసి వినీ ఆస్వాదించండి. ఈ పాట ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : కులగోత్రాలు (1962) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం : సినారె గానం: ఘంటసాల, సుశీల చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా.. ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా.. చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు...

బుధవారం, మే 14, 2014

నవమి నాటి వెన్నెల నేను...

రమేష్ నాయుడు గారి మరో ఆణిముత్యం ఈ పాట, నాకు చాలా ఇష్టమైనది, ముఖ్యంగా మధురమైన ఆ బాణి వింటూంటే ఎంత హాయిగా ఉంటుందో మాటలలో చెప్పడం కష్టం. ఇక వేటూరి గారి నవమి దశమి పద ప్రయోగం గురించి కూడా చాలా చర్చలు జరిగాయి ఆన్ లైన్ ఫోరమ్స్ లో. కొందరు "ఇద్దరూ గొప్పే... కానీ అసంపూర్ణం.. ఆఇద్దరూ కలిస్తేనే పున్నమి..." అనే స్ట్రెయిట్ అర్ధమే ఉంది అంటే, ఇంకొందరు "జయసుధ హీరో కన్నా వయసులో పెద్ద కనుక, ఆమెను ముందు పుట్టిన నవమి నాటి వెన్నెలతో పోల్చి వేటూరి వారు చమత్కరించారు"...

మంగళవారం, మే 13, 2014

ఓ మనసా తొందరపడకే...

సంధర్బానుసారంగా భువన చంద్ర గారు రాసిన ఒక చక్కని పాట మీకోసం... చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఒక చిన్నమాట(1997)  సంగీతం : రమణి భరద్వాజ్  సాహిత్యం : భువనచంద్ర గానం : బాలు, చిత్ర ఆఆ..ఆఆ...ఆఆఆ...  లల్లలల్లలాలల లల్లలల్లలాలల      ఓ మనసా తొందర పడకే పది మందిలో అల్లరి తగదేకను చూపులు కలిసే వేళ నా మాటలు కొంచెం వినవేవరమిచ్చిన...

సోమవారం, మే 12, 2014

ఢిల్లీకీ రాజాకైనా..

నిన్నటి వరకూ అమ్మ ప్రేమ గొప్పదనం తెలిపే పాటలు విన్నారుగా ఈవేళ బామ్మ మాట గురించి వినండి :-) భానుమతి గారి స్వరంలో ఖంగుమంటూ వినిపించే ఈ పాట నాకు అప్పుడప్పుడు సరదాగా వినడం ఇష్టం. ఈ సినిమా తలచుకున్నపుడల్లా చిన్నపుడు చూసి ఎంజాయ్ చేసిన ఇందులోని సూపర్ కార్ చేసే విన్యాసాలు గుర్తొచ్చి ఆనందమనిపిస్తుంది. దాంతోపాటే ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేసి మరిన్ని ఉన్నతశిఖరాలు చేరుకోగల సత్తా ఉన్న నూతన్ ప్రసాద్ లాంటి గొప్ప నటుడి కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం గుర్తొచ్చి...

ఆదివారం, మే 11, 2014

మాతృదినోత్సవ శుభాకాంక్షలు...

బ్లాగ్ మిత్రులందరకూ మాతృదినోత్సవ శుభాకాంక్షలు... ఈ ప్రత్యేక సంధర్బంలో అమ్మప్రేమను తలచుకుంటూ... కీరవాణి గారు స్వరపరచిన ఈ కమ్మని అమ్మపాట మీ అందరి కోసం. సౌందర్య ఈ పాటలో అమ్మ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది, అలాగే ఈ చిన్నారి బాబు కూడా చాలా చక్కగా నటించాడు తను పి.బి.శ్రీనివాస్ గారి మనవడుట. ఈ పాట చిత్రీకరణ కూడా నాకు బాగా ఇష్టం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోండి. చిత్రం : ప్రియరాగాలు(1997) సంగీతం : కీరవాణి  సాహిత్యం...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.