ఆదివారం, జులై 28, 2019

మనసూగింది ఉయ్యాలలా...

అమ్మకోసం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అమ్మకోసం (1970)
సంగీతం : ఆదినారాయణరావు
రచన : సినారె
గానం : పి.సుశీల

ఈ లోయలోనా ఈ పాయలోనా
ఈ లోయలోనా ఈ పాయలోనా
నిలువెల్ల సోకే నీరెండలోన
మనసూగింది ఉయ్యాలలా
మనసూగింది ఉయ్యాలలా
కదలే గోదావరి కెరటాలలా
మనసూగింది ఉయ్యాలలా


ఓఓఓ...
సరసాల చిరుగాలి గురి చూసి వీచింది
సరసాల చిరుగాలి గురి చూసి వీచింది
పులకించు పరువం పురివిప్పి ఆడింది
పులకించు పరువం పురివిప్పి ఆడింది
కొంటె పొదరిల్లు కొనకొంగు లాగింది
కొంటె పొదరిల్లు కొనకొంగు లాగింది
గుండె ఝల్లంది, ఝల్లంది...ఓ

మనసూగింది ఉయ్యాలలా
కదలే గోదావరి కెరటాలలా
మనసూగింది ఉయ్యాలలా


ఓఓ...నీలాటి రేవులోన నీడయేదో కదిలింది
నీలాటి రేవులోన నీడయేదో కదిలింది
నను చూసి ఎవరో నవ్వినట్టు తోచింది
నను చూసి ఎవరో నవ్వినట్టు తోచింది
అమ్మో! కొరమీను అరికాలు మీటింది
అమ్మో! కొరమీను అరికాలు మీటింది
స్స్...ఒళ్ళు జిల్లంది జిల్లంది... ఓ...

మనసూగింది ఉయ్యాలలా
కదలే గోదావరి కెరటాలలా
మనసూగింది ఉయ్యాలలా

 

2 comments:

భలే ఉందీ పాట..యెప్పుడూ వినలేదు..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.