మంగళవారం, జులై 23, 2019

వస్తాడు నా రాజు ఈ రోజు...

అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అల్లూరి సీతారామ రాజు (1974)
సంగీతం : పి.ఆదినారాయణ రావు
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : పి.సుశీల

వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
తేలి వస్తాడు నా రోజు ఈ రోజు

వేల తారకల నయనాలతో
నీలాకాశం తిలకించేను
వేల తారకల నయనాలతో
నీలాకాశం తిలకించేను
అతని చల్లని అడుగుల సవ్వడి
వీచే గాలి వినిపించేను
ఆతని పావన పాద ధూళికై
అవని అణువణువు కలవరించేను
అతని రాకకై అంతరంగమే
పాలసంద్రమై పరవశించేను
పాలసంద్రమై పరవశించేను

వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు

వెన్నెలలెంతగా విరిసిన గాని
చంద్రుణ్ణి విడిపోలేవు
కెరటాలెంతగా పొంగిన గాని
కడలిని విడిపోలేవు
కలసిన ఆత్మల అనుబంధాలు
ఏ జన్మకూ విడి పోలేవులే
తనువులు వేరైనా దారులు వేరైనా
తనువులు వేరైనా దారులు వేరైనా
ఆ బంధాలే నిలిచేనులే
ఆ బంధాలే నిలిచేనులే

వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
వస్తాడు నా రాజు ఈ రోజు

 

2 comments:

ఈ రోజుల్లో కూడా ఈ పాట యాప్ట్ గానే ఉంటుంది..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.