మంగళవారం, నవంబర్ 06, 2018

నా జీవన బృందావనిలో...

బుర్రిపాలెం బుల్లోడు చిత్రంలోని ఒక మధురగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బుర్రిపాలెం బుల్లోడు(1979)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, సుశీల

నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో
నిన్ను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో
నా జీవన బృందావని లో ఆమని ఉదయంలో
నిన్ను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో
కనిపించె నీలో కళ్యాణ తిలకం
వినిపించె నాలో కళ్యాణి రాగం
ఏనాటిదో ఈ రాగమూ ఏ జన్మదో ఈ బంధమూ
ఏనాటిదో ఈ రాగమూ ఏ జన్మదో ఈ బంధమూ

నీవు నన్ను తాకిన చోట పులకరింత పువ్వవుతుంటే..
మేను మేను సోకిన పాటా వేణు గానమైపోతుంటే..
నీవు నన్ను తాకిన చోట పులకరింత పువ్వవుతుంటే..
మేను మేను సోకిన పాటా వేణు గానమైపోతుంటే..
మనసులో మధుర వయసు లో యమున కలిసి జంటగా సాగనీ..
మన యవ్వనాల నవ నందనాల మధు మాస మధువులే పొంగనీ..
ముద్దు ముద్దులడిగిన వేళా నెమలి ఆట ఆడనీ..
ముద్దు ముద్దులడిగిన వేళా నెమలి ఆట ఆడనీ..
ఇదే రాసలీలా ఇదే రాగ డోలా
ఇదే రాసలీలా ఇదే రాగ డోలా

నా జీవన బృందావని లో ఆమని ఉదయంలో
నిన్ను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో
నా జీవన బృందావని లో ఆమని ఉదయంలో
నిన్ను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో
నా ప్రాణమంతా నీ వేణువాయే
పులకింతలన్నీ నీ పూజ లాయే
యేయోగమో ఈ రాగమూ ఏ జన్మదో ఈ బంధమూ
యేయోగమో ఈ రాగమూ ఏ జన్మదో ఈ బంధమూ

ఇంద్రధనసు పల్లకీలో..చంద్రుడల్లె నువ్వొస్తుంటే..
నల్ల మబ్బు కాళ్ళు కడిగీ మెరుపు కొంగు ముడిపెడుతుంటే..
ఇంద్రధనసు పల్లకీలో..చంద్రుడల్లె నువ్వొస్తుంటే..
నల్ల మబ్బు కాళ్ళు కడిగీ మెరుపు కొంగు ముడిపెడుతుంటే..
రాగలహరి అనురాగ నగరి రస రాజధాని నను చేరనీ
శృంగార రాజ్య సౌందర్య రాణి పద రేణువై చెలరేగనీ
నింగి నేల కలిసిన చోటా నిన్ను నేను పొందనీ
నింగి నేల కలిసిన చోటా నిన్ను నేను పొందనీ
అదే రాసలీలా అదే రాగ డోలా
అదే రాసలీలా అదే రాగ డోలా


2 comments:

పిక్ అద్భుతహ..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.