శనివారం, నవంబర్ 10, 2018

ముందు వెనకా వేటగాళ్ళు...

బంగారు చెల్లెలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బంగారు చెల్లెలు (1979)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

ముందు వెనకా వేటగాళ్ళు
ముద్దులాడే జంట లేళ్ళు
ప్రేమ ఎంత ప్రేమ
అమ్మమ్మా ఏందమ్మా

కొండకోనా పొదరిళ్ళు
గుండెలోనా పడకటిళ్ళు
ప్రేమ అదే ప్రేమ
అమ్మమ్మా అవునమ్మా

అడవి గాలిలా నన్ను కమ్ముకో
అయోధ్య రాముడల్లే ఆదుకో
అడవి గాలిలా నన్ను కమ్ముకో
అయోధ్య రాముడల్లే ఆదుకో
 బంగారు లేడి నిన్ను అడగనుపో
శృంగార రాముడివై ఏలుకో
నా అందాల ఏలికవై ఉండిపో

అమ్మమ్మా అవునమ్మా 
 ముందు వెనకా వేటగాళ్ళు
ముద్దులాడే జంట లేళ్ళు
ప్రేమ ఎంత ప్రేమ
అమ్మమ్మా అవునమ్మా 
  
నీలాల నీ కురుల దుప్పటిలో
సిరిమల్లె పూల చిలిపి అల్లరిలో 
నీలాల నీ కురుల దుప్పటిలో
సిరిమల్లె పూల చిలిపి అల్లరిలో
 నీ వయసు మెరిసింది కన్నులలో
నా మనసు ఉరిమింది చూపులలో
నే కరగాలి నీ కన్నె కౌగిలిలో

కొండకోనా పొదరిళ్ళు
గుండెలోనా పడకటిళ్ళు
ప్రేమ అదే ప్రేమ
అమ్మమ్మా ఏందమ్మా

నా గుండెలో నీ తల దాచుకో
నా ఎండలో నీ చలి కాచుకో
నా గుండెలో నీ తల దాచుకో
నా ఎండలో నీ చలి కాచుకో
నా వన్నె చిన్నెలన్ని పంచుకో
నన్నింక నీలోనే పెంచుకో
ఈ గురుతునే బ్రతుకంత ఉంచుకో

ముందు వెనకా వేటగాళ్ళు
ముద్దులాడే జంట లేళ్ళు
ప్రేమ ఎంత ప్రేమ
అమ్మమ్మా ఏందమ్మా 
అమ్మమ్మా ఏందమ్మా

 

2 comments:

ఈ పాట ఇదేనండీ వినడం..బావుంది..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.