శుక్రవారం, నవంబర్ 16, 2018

అమ్మాయీ అమ్మాయీ...

ప్రజారాజ్యం చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రజారాజ్యం (1983)
సంగీతం :  జె.వి. రాఘవులు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

అమ్మాయీ... అమ్మాయీ
అమ్మాయీ... అమ్మాయీ
కోకంతా గొడవాయే రైకంతా బిగువాయే
ఏమొచ్చెనే అమ్మడూ
ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే ఒళ్ళంతా
ఈడొచ్చెరో పిల్లడూ


కోకంతా గొడవాయే రైకంతా బిగువాయే
ఏమొచ్చెనే అమ్మడూ
ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే ఒళ్ళంతా
ఈడొచ్చెరో పిల్లడూ


హహా... హహా... హహా...

కులుకమ్మా నడుమంతా గుప్పెట్లోనే దాచా
గుప్పెట్లో గిలిగింతా కౌగిట్లోనే చూశా
కులుకమ్మా నడుమంతా గుప్పెట్లోనే దాచా
గుప్పెట్లో గిలిగింతా కౌగిట్లోనే చూశా
అందంలో సంగీతం సందెల్లో సావాసం
అహ్హా.. ఒహ్హో... అహ్హా..

కోకంతా గొడవాయే రైకంతా బిగువాయే
ఏమొచ్చెనే అమ్మడూ అహ్హా..
ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే ఒళ్ళంతా
ఈడొచ్చెరో పిల్లడూ
హహా...
హహా... హహా...

కవ్వించే అందాలే కళ్ళల్లో ఆరేశా
కౌగిళ్ళా మత్తుల్లో ఇళ్ళెన్నో కట్టేశా
కవ్వించే అందాలే కళ్ళల్లో ఆరేశా
కౌగిళ్ళా మత్తుల్లో ఇళ్ళెన్నో కట్టేశా

ఒళ్ళంతా వయ్యారం వందేళ్ళా సంసారం
అహా.. ఒహో.. అహా..

కోకంతా గొడవాయే రైకంతా బిగువాయే
ఏమొచ్చెనే అమ్మడూ
ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే ఒళ్ళంతా
ఈడొచ్చెరో పిల్లడూ


హహ్హా... హొహ్హో... హహ్హా...

చేపంటి ఆ కళ్ళు చెప్పేవే ఆకళ్ళు
ఎదురైతే ఉవ్విళ్ళు ఎదకొచ్చే ఎక్కిళ్ళు
చేపంటి ఆ కళ్ళు చెప్పేవే ఆకళ్ళు
ఎదురైతే ఉవ్విళ్ళు ఎదకొచ్చే ఎక్కిళ్ళు
నీ ముద్దే మందారం ముదిరిందీ యవ్వారం
అహ్హా.. ఒహో.. అహ్హా..

కోకంతా గొడవాయే రైకంతా బిగువాయే
ఏమొచ్చెనే అమ్మడూ
ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే ఒళ్ళంతా
ఈడొచ్చెరో పిల్లడూ

అహ్హా..ఒహో.. అహ్హా.. 


4 comments:

ఈ సినిమా ఎంత జనరంజకంగా ఉంటుందో ఈ పాట అంత అశ్లీలంగా ఉంటుంది. హిందీలో వచ్చిన "ఉయ్యమ్మా ఉయ్యమ్మా" అన్న బప్పిలహరి పాట ట్యూన్ ని బేస్ చేసుకుని తెలుగులోకి తర్జుమా చేసిన పాట ఇది. "కోకంతా గొడవాయే... రైకంతా బిగువాయే" అన్న పదాల వాడుక చాలామంది నుంచి వివాదాస్పద వ్యాఖ్యలకు కారణభూతమయ్యింది. పెద్ద పెద్ద రచయితలకాడి నుంచి మల్లిక్ లాంటి కార్టూనిస్టులు కూడా ఈ పాటగురించి వ్యంగ్యోపనిషత్తులు వ్రాసారు. వేటూరిగారి కలం నుంచి అప్పుడప్పుడూ ఊరే "నీలి" సిరా గురించి మరోసారి అందరూ ప్రశ్నించే అవకాశమిచ్చిన పాట. ఈ పాట లానే "ఆకుందా వక్కిస్తా" అన్న బప్పిలహరి పాట కూడా ఇదే కోవకు చెందినది. ఎంత మంచి బీట్ ఉన్నా ఇలాంటి సాహిత్యం ఆ పాటలు అజరామరం అవ్వకుండా చేసిందన్నది నిర్వివాదాంశం.

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ భవానిప్రసాద్ గారు.. డర్టీపిక్చర్ రిలీజ్ టైమ్ లో ఈ పాట హిందీ పాట గురించి వెతికినపుడు హిందీ సినిమా మవాలి ఒకే ఏడాది నవంబర్ లోనూ తెలుగు ప్రజారాజ్యం సెప్టెంబర్ లోనూ రిలీజైందని ఉందండీ నెట్ లో... ట్యూన్ అంతా బప్పీలహరి వినిపిస్తున్నా కూడా హిందీ పాటలు అంత ముందుగా రిలీజ్ అయి ఉంటాయా ఏది ముందా అని ఆలోచనొచ్చింది.

రెండూ కృష్ణగారి పద్మాలయా బేనర్ క్రిందనే నిర్మితమయినాయి. "మవాలి" అన్న సినిమా బాపయ్యగారి దర్శకత్వంలో "చుట్టాలున్నారు జాగ్రత్త" అనే తెలుగు సినిమా ఆధారంగా నిర్మించారు.

ఓహో రెండూ పద్మాలయా బ్యానర్ అంటే ఇక సందేహం అక్కర్లేదులెండి.. థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ భవానీ ప్రసాద్ గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.