బుధవారం, అక్టోబర్ 31, 2018

ఎంత ఘాటు ప్రేమయో...

ముఠామేస్త్రి చిత్రంలోని ఒక చక్కని పాటని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ముఠామేస్త్రి (1993)
సంగీతం : రాజ్ కోటి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌనగీతమా
వచ్చీరాని వయ్యారాలే వయసాయే
మళ్ళీ మళ్ళీ సాయంత్రాలే మనసాయే
నిజమా… హమ్మమ్మా…

చిలిపి కనుల కబురు వింటే
బిడియమో ఏమో సుడులు రేగింది

పెదవి తొనల మెరుపు కంటే
ఉరుములా నాలో ఉడుకు రేగింది
గుబులో దిగులో వగలైపోయే వేళలో
తనువు తనువు తపనై తాకే వేడిలో
మల్లి జాజి జున్నులా చలి వెన్నెల ముసిరేనిలా
నిజమా… హమ్మమ్మా…

ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌనగీతమా

చిగురు తొడిగే సొగసుకంటే
పొగరుగా ప్రాయం రగిలిపోయింది
ఉలికి నడుము కదుపుతుంటే
తొలకరింతల్లో తొడిమ రాలింది

కుడివైపదిరే శకునాలన్ని హాయిలే
ప్రియమో ఏమో నయగారాలే నీవిలే
గోరింటాకు పూపొద చలి ఆపదా ఇక ఆపదా
నిజమా… హమ్మమ్మా…

ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌనగీతమా 

 

2 comments:

మెలొడీ టచ్ ఉన్న ప్యూర్ కమర్షియల్ సాంగ్

అవునండీ దానికి చిరు స్టెప్స్ గ్రేస్ యాడ్ అయింది.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.