మంగళవారం, అక్టోబర్ 30, 2018

రాగాల సిలకా...

పల్నాటి పౌరుషం చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పల్నాటి పౌరుషం (1994)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం : శివగణేష్
గానం : మనో, సుజాత

మేనత్త కూతురివే మెరుపంటి మరదలివే
మదిలోన మరులొలికే మరుమల్లె జాతరవే
పొట్టిజళ్ళ పాలపిట్ట పైటకొచ్చెనెప్పుడంట
చిన్ని చిన్ని చంద్రవంక పూర్ణమెప్పుడయ్యెనంట
నీ మాట మూగబోతె నా మనసు ఆగెదెట్టా..ఆ

రాగాల సిలకా రంగేళి మొలకా
రాయంచ నడకా రావాకు తళుకా
రాగాల సిలకా రంగేళి మొలకా
రాయంచ నడకా రావాకు తళుకా

ఎదలోన ఎలుగునీడలా ఎదుట ఎవరు ఇది
ఎంకి పాటలా జాలువారుతున్న
జాబిలంటి జాణతనమా
జారు పైట వేసుకున్న జానపదమా..ఆ
రాగాలేవో నీలో నాలో వినిపించే
అనురాగాలేగా నిన్నూ నన్నూ కనిపెంచే

రాగాల సిలకా రంగేళి మొలకా
రాయంచ నడకా రావాకు తళుకా

కంటికీ కునుకే రాదాయే
నోటికీ మెతుకే చేదాయే
ఒంటిలో తాపం ఏదో మొదలాయే..ఏ
ఎక్కడో కాకులు కూస్తున్నా
ఎవ్వరో తలుపులు తీస్తున్నా
నువ్వనే వెతికే గుండెకి గుబులాయే..ఏ
నావకడ గట్టిగ అరిచానూ
బావ సడి గుట్టుగ అడిగానూ
గాలితో కబురులు పంపానూ
మబ్బుతో మనసులు తెలిపానూ
దేనికీ బదులే రాకా కుదురే లేకా కన్నీరొలికానూ
ముద్దుల బావా నన్నిక ఇడిసి పోవద్దూ
ఈ మరదలి పేణం నీపై ఉందని మరవద్దూ

రాగాల సిలకా రంగేళి మొలకా..ఆ
రాయంచ నడకా రావాకు తళుకా..ఆ

కళ్ళలో కలతలు తీరేనా
కాళ్ళపై వాతలు మాసేనా
రాళ్ళపై రాసిన రాతలు గురుతేనా
దాగనీ సొగసులు పొంగేనా
దాగినా దారులు తెరిచేనా
కొంగులో కోలాటాలే కోరేనా
ఆశగా ఆరా తీస్తున్నా అందమే ఆరాధిస్తున్నా
ఆశగా ఆరా తీస్తున్నా అందమే ఆరాధిస్తున్నా
ముందుగా బంధం వేసిన హృదయం
లోనికి విందుకు వస్తున్నా
మరదలు పిల్లా నిన్నిక విడిచీ వెళ్ళనులే
మన పెళ్ళికి లగ్గం దగ్గరలోనే ఉన్నదిలే

రాగాల సిలకా రంగేళి మొలకా
రాయంచ నడకా రావాకు తళుకా
ఎదలోన ఎలుగునీడలా ఎదుట ఎవరు ఇది
ఎంకి పాటలా జాలువారుతున్న
జాబిలంటి జాణతనమా
జారు పైట వేసుకున్న జానపదమా..ఆ
రాగాలేవో నీలో నాలో వినిపించే
అనురాగాలేగా నిన్నూ నన్నూ కనిపెంచే

రాగాల సిలకా రంగేళి మొలకా
రాయంచ నడకా రావాకు తళుకా


2 comments:


నిజంగా హుషారైన పాటే ఇది..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.