మంగళవారం, అక్టోబర్ 23, 2018

వెయ్యిన్నొక్క జిల్లాల...

సూర్య ఐపిఎస్ చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


 
చిత్రం : సూర్య IPS (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే...
ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే...
హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడలయ్యావొ ఏమో వయ్యారీ

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే

ఖర్మకాలి రావణుండు నిన్ను చూడలేదు గానీ
సీత ఊసునే తలచునా త్వరపడీ
భీష్ముడున్న కాలమందు నువ్వు పుట్టలేదు గానీ
బ్రహ్మచారిగా బ్రతుకునా పొరబడీ

ఇంతగొప్ప అందగత్తె ముందుగానె పుట్టి ఉంటె
పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే
ఓహొహొహో
ఇంతగొప్ప అందగత్తె ముందుగానె పుట్టి ఉంటె
పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే
పొరపాటు బ్రహ్మది గాని సరిలేనిది అలివేణీ

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే...
ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే...
హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడలయ్యావొ ఏమో వయ్యారీ

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే

అల్లసాని వారిదంత అవకతవక టేస్టు గనక
వెళ్ళిపోయెనే చల్లగా ప్రవరుడూ
వరూధినిని కాక నిన్నే వలేసుంటె
కళ్ళు చెదిరి విడిచిపెట్టునా భామినీ బ్రాహ్మడూ

ఒక్కసారి నిన్నుచూస్తే రెప్పవెయ్యలేరు ఎవరు
కాపురాలు గంగకొదిలి వెంటపడతారే
అరెరరెరరె
ఒక్కసారి నిన్నుచూస్తే రెప్పవెయ్యలేరు ఎవరు
కాపురాలు గంగకొదిలి వెంటపడతారే
ముసలాడి ముడతలకైనా కసి రేపగలదీ కూన

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నానము నీ కీర్తినే...
ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే...
హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడలయ్యావొ ఏమో వయ్యారీ

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నానము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే


2 comments:

చాలా చాలా ఇష్టమైన పాట..ఇందులో అన్ని సాంగ్స్ బావుంటాయి..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.