సోమవారం, మే 07, 2018

చినికి చినికి చిలిపి గాలి...

నా నువ్వే చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ ప్రోమో వీడియో ఇక్కడ చూడవచ్చు పూర్తి పాట లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నా నువ్వే (2018)
సంగీతం : శరత్
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : కార్తీక్, సప్తపర్ణ చక్రవర్తి

చినికి చినికి చిలిపి గాలి తడి
తగిలి తగిలి వలపు వానజడి
కురిసి కురిసి వయసు వాగువడి
పెరిగి పెరిగి మనసు గండిపడి
వరదై వరదై ఉరుకు ప్రేమనది
ఒడులై సుడులై కడలై ఎగిసినదే

ఏమైందో  ఏమైందో
ఇపుడసలేమేమి ఔతుందో సమయం
ఎం చేయ్యమంటుందో తెలియదే
తెలియదే తెలియదే తెలియదే

ఈడు బరిలో అధరాలు నిలబడి
సైనికులుగా సమరాన కలబడి
ఏది గెలుపో మరిచేంత ఎగబడి
ఆత్రపడుతూ మరికొంత మెలిపడి

ఏకం అవుతూ తికమక
ఎదో చేస్తూ సుఖముల
రాజ్యాలేలే పదవిని
పొందాయేమో పెదవులిలా

మాయ మరుపే ముసిరింది మనలను
హాయి మెరుపే తెరిచింది కనులను
తీపి తలపే కలిపింది ఎదలను
చేరువయితే అరచెయ్యి వదలను

నేనే  నీవై ఇప్పుడిక
నాలో నేనే  మిగలను
నీలో శ్వాసై కదులుతూ
లోలో ఆశై కరిగెదనే

చినికి చినికి చిలిపి గాలి తడి
తగిలి తగిలి వలపు వానజడి
కురిసి కురిసి వయసు వాగువాడి
పెరిగి పెరిగి మనసు గండిపడి
వరదై వరదై ఉరుకు ప్రేమనది
ఒడులై సుడులై కడలై ఎగిసినదే

ఏమైందో  ఏమైందో ఇపుడసలేమేమి
 ఔతుందో సమయము
ఎం చేయమంటుందో తెలియదే
తెలియదే తెలియదే తెలియదే
తెలియదే తెలియదే 


2 comments:

విత్ డ్యూ రెస్పెక్ట్స్ టూ కల్యాణ్రాం ఫాన్స్.. హీరో మొట్టమొదటి సారి కాస్త బావున్నట్టున్నాడు మరి..

హహహహ అవునండీ ఈ గెటప్ బాగా సూటైంది కళ్యాణ్ రాం కి.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.