శనివారం, నవంబర్ 04, 2017

ఆట.. ఆట.. ఇది గెలవక...

ఆట చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆట (2007)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : శంకర్ మహదేవన్

అ అ అ... ఆట... అ అ అ... ఆటా...
అ అ అ... ఆట... అ అ అ... ఆటా...
హే.. జెండాపై కపిరాజుంటే రథమాపేదెవరంట
గుండెల్లో నమ్మకముంటే బెదురెందుకు పదమంట
అ అ అ... ఆట... అ అ అ... ఆటా...
అ అ అ... ఆట... అ అ అ... ఆటా...

అల్లాద్దీన్ అద్భుతదీపం అవసరమే లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట
అల్లదిగో ఆశల దీపం కళ్ళెదుటే ఉందంట
ఎల్లలనే పెంచే వేగం మేఘాలు తాకాలంట
 
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా
ఆట ఆట అనుకుంటే బతకడమొక ఆట
ఆట ఆట కాదంటే బరువే ప్రతి పూట

అ అ అ... ఆట... అ అ అ... ఆటా...
అ అ అ... ఆట... అ అ అ... ఆటా...

హే.. ముందుగా తెలుసుకో మునిగే లోతెంత
సరదాగా సాగదు బేటా నట్టేట ఎదురీత
తెలివిగా మలుచుకో నడిచే దారంతా
పులి మీద స్వారీ కూడ అలవాటు అయిపోదా
సాధించే సత్తావుంటే సమరం ఒక సయ్యాటా
తల వంచుకు రావలిసిందే ప్రతి విజయం నీ వెంటా

అల్లాద్దీన్ అద్భుతదీపం అవసరమే లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా

చెలిమితో గెలుచుకో చెలితో వలపాట
అతిలోక సుందరి రాదా జత కోరి నీవెంట
తెగువతో తేల్చుకో చెడుతో చెలగాట
జగదేకవీరుడు కూడ మనలాంటి మనిషంట
ఇటునుంచే అటువెళ్ళారు సినిమా హీరోలంతా
దివి నుంచేం దిగిరాలేదు మన తారాగణమంతా
మనలోనూ ఉండుంటారు కాబోయే ఘనులంతా
పైకొస్తే జైకొడతారు అభిమానులై జనమంతా

ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా
ఆట ఆట అనుకుంటే బతకడమొక ఆట
ఆట ఆట కాదంటే బరువే ప్రతిపూట
అ అ అ... ఆట... అ అ అ... ఆటా...
అ అ అ... ఆట... అ అ అ... ఆటా...

  

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail