శుక్రవారం, నవంబర్ 03, 2017

చెయ్ జగము మరచి...

అశ్విని చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అశ్విని (1992)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

చెయ్ జగము మరచి జీవితమే సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన
చెయ్ జగము మరచి జీవితమె సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన


ఆశయమన్నది నీ వరం
తలవంచును అంబరం
నీ కృషి నీకొక ఇంధనం
అది సాగర బంధనం

చెయ్ జగము మరచి జీవితమే సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన
చెయ్ జగము మరచి జీవితమె సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన


నిదురపోనేల నింగినీనేల
అలుపురానేల గెలుపునిన్నేల
ఒడలు వంచాలి ఓడి గెలవాలి
కదలి రావాలి కాలమాగాలి
కలలు పండాలి గగన మందాలి
నేడు నీకిది జీవన విధానం
బ్రతుకు నవ్విన నందనం
నీదొక ఆగని ప్రయాణం
అడుగు దాటును యోజనం

చెయ్ జగము మరచి జీవితమే సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన


ఉడుకు పుట్టాలి ఊపు రావాలి
చెమట పిండాలి శ్రమలు పండాలి
మట్టిలో పుట్టి మణివి కావాలి
జనము చూడాలి జాతి మెచ్చాలి
మెదడుకే నీవు పదును పెట్టాలి
నేడు నీదొక నూతన పురాణం
విజయ విప్లవ కేతనం
నీవొక జీవన ప్రమాణం
ప్రగతికే అది చేతనం

చెయ్ జగము మరచి జీవితమే సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన
చెయ్ జగము మరచి జీవితమె సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన

ఆశయమన్నది నీ వరం
తలవంచును అంబరం
నీ కృషి నీకొక ఇంధనం
అది సాగర బంధనం  
 

1 comments:
నీ మదిని తరచి చూడడ
మే మగువా శోధన! విను మేధా జీవీ !
నీ మది సాధన జేయన్
కౌముది, జీవితము లోన కాదేదీ "నో" :)

జిలేబి

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail