మంగళవారం, నవంబర్ 28, 2017

మెరుపై సాగరా...

స్టైల్ చిత్రంలోని ఒక చక్కని ఉత్తేజభరితమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్టైల్ (2006)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : చిన్నిచరణ్
గానం : కార్తీక్

మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా
నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా
వెనకడుగే వేయక ముందుకు సాగరా
నలుదిక్కులు నవ్వుతు ఉన్నా
నలుపెక్కని సూర్యుడు నువ్వై
ఆ చుక్కలనే ఇల దించే
నీ శక్తి ని యుక్తి గ చూపెయ్
నటరాజై నువు రాజెయ్ నీ గెలుపే నీలో

మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా

 
అమ్మ మాట కోసం నువ్వు ఆయుధం గా మారి
కొండలే డీకొట్టరా అది ఎంత కష్టమైనా
ఆశయాల పీఠం నువు అందుకున్న నాడు
నిండుగా మురిసేను రా మీ అమ్మ ఎక్కడున్నా
చేయూతే ఇస్తుంటే ఓ స్నేహబంధం
చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం
నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం
ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం
లేరా అడుగెయ్ రా ఆ శిఖరం చేరా

మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా

 
కింద పడుతు ఉన్నా పైపైకి పరుగు తీసి
అలలతో పోటి పడి చేరాలి కలల కడలి
పందెమేది ఐనా నీ పట్టుదలను చూసి
ఒంటరై వణకాలిరా ఆ ఓటమైనా హడలి
అందరికి చేతుల్లో ఉంటుంది గీతా
నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మ రాత
నీ కాళ్ళు అడుగులతో కాలాన్ని ఆపి
లోకాలే పొగిడేలా చూపించు ఘనత
లేరా చిందెయ్ రా విజయం నీదేరా

మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా
  
 

2 comments:

స్పూర్తినిచ్చే పాట.

థాంక్స్ పద్మార్పిత గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.