శనివారం, నవంబర్ 11, 2017

సానపట్టు పట్టకుంటె...

అశ్విని చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అశ్వని (1992)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : చిత్ర

సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా
ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా

లోని వెలుగు చూడరా పైని మెరుగు కాదు
దారి మలుపు తిప్పరా గెలుపు నీది నేడు
సవాలు గుర్రముందిరా సవారి చేసి చూడరా
నిరాశ నీకు చేటు ఆశయాల చేక్కు పోస్టు నీకు రూటు

సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా
ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా


నా ఫుడ్డు మానేసినా ఈ గుడ్డు తెచ్చానులే
చపాతీ కుర్మాలగా చమటోడ్చీ తెచ్చానులే
బొజ్జనిండ ఆరగించు బుజ్జి అమ్మడు
కండ దండిగుంటె పండగా
పెట్టుకున్న ఆశలన్నీ తీర్చు అమ్మడు
తీర్చకుంటె తిండి దండగా
తారలందు నీవె ఫస్టులే ఆశ్వని

సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా
ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా


త్యాగాలూ నీకోసమే చేసేటీ వారుండగా
ప్రాణాలే నీకోసమే పంచేటీ వారుండగా
బుద్దిలేని బద్దకాలు మాను అమ్మడూ
నిన్న మాట నిండు సున్నగా
ఆకసాన సంతకాలు చెయ్యి ఇప్పుడూ
నింగి దాక వేసి నిచ్చెనా
రామబాణమల్లె సాగవే ఆశ్వనీ

సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా
ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా

లోని వెలుగు చూడరా పైని మెరుగు కాదు
దారి మలుపు తిప్పరా గెలుపు నీది నేడు
సవాలు గుర్రముందిరా సవారి చేసి చూడరా
నిరాశ నీకు చేటు ఆశయాల చేక్కు పోస్టు నీకు రూటు

సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా
ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.