ఆదివారం, జులై 02, 2017

గాలిగో.. గాలిగో...

శాంత్రి క్రాంతి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం :శాంతి క్రాంతి (1991)
సంగీతం : హంసలేఖ 
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, జానకి

గాలిగో గాలిగో ఓహో పిల్లగాలిగో 
ఈలగా గోలగా నన్ను గిల్లి మేలుకో
ఓ ప్రియురాలా నా ఊపిరందుకో 
పరువముతో పరిచయమే పరిమళమై
వేసవిగాలుల్లో వెన్ను కాచుకో 
ముసురుకునే విరహములే ఉసురుసురై

గాలిగో గాలిగో ఓహో పిల్లగాలిగో
ఈలగా గోలగా నన్ను గిల్లి మేలుకో

చిలిపిగా జతలనే కలుపు కౌగిలికి నువ్వే వరం 
వలపులో జతులనే పలుకు కీర్తనకు నువ్వే స్వరం 
తపనలు గని రెప రెపమనే నీ పైటలో నీ పాటలో 

జల్లుగో జల్లుగో స్వాతివాన జల్లుగో 
ఒంటికీ వానకీ వంతెనేయి చల్లగో 
శ్రావణ సంధ్యల్లో సంధి చేసుకో 
సరసమనే సమరములో వర్షములో 
ఓ ప్రియురాల నీ వెల్లువిచ్చుకో 
ఉరవడులే కలబడిన చలి ఒడిలో 

జల్లుగో జల్లుగో స్వాతివాన జల్లుగో 
ఒంటికీ వానకీ వంతెనేయి చల్లగో
 
మనసనే మడుగులో సుడులు రేగినది నా జీవితం 
తడుపులో మెరుపులా తరలు ప్రేయసికి నా స్వాగతం
ఉరుముల సడి నడుమున పడే 
నీ వేటలో సయ్యాటలో

మంచుగో మంచుగో మంచె తోడు ఉంచుకో 
మాఘమో మోహమో మాయచేసి పెంచుకో 
ఓ ప్రియురాల నా దుప్పటందుకో 
వణుకులలో తొణికిన ఈ తళుకులలో
ఈ చలిమంటలలో చలికాచుకో 
సలసలతో కిల కిలలే కలబడగా 

మంచుగో మంచుగో మంచె తోడు ఉంచుకో 
మాఘమో మోహమో మాయచేసి పెంచుకో

హిమములా మహిమలో శ్రమను వీడినది నా జవ్వనం 
సుమములా చెలిమిలో సుఖము కోరినది నా జాతకం 
మిల మిల మనే మిణుగురులతో 
సాగిందిలే సాయంకాలమూ 

మంచుగో మంచుగో మంచె తోడు ఉంచుకో 
మాఘమో మోహమో మాయచేసి పంచుకో 



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.