మంగళవారం, ఏప్రిల్ 04, 2017

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు...

ఈ రోజు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం టైటిల్ సాంగ్ ను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)
సంగీతం : మిక్కీ జే మేయర్
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : చిత్ర

ఏకువలోనా గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింటా పంటైయ్యింది
ఏకువలోనా గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింటా పంటైయ్యింది

పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి
అహ సిగ్గంతా చీర కట్టింది
చీరలో చందమామా ఎవ్వరమ్మా
ఆ గుమ్మ సీతమ్మా

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు
కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి
కొప్పున పూలు గుప్పే తంతెందుకండి
కోదండరామయ్య వస్తున్నాడండీ

రానే వచ్చాడోయమ్మా ఆ రామయ్య
వస్తూ చేశాడోయమ్మా ఏదో మాయా
రానే వచ్చాడోయమ్మా ఆ రామయ్య
వస్తూ చేశాడోయమ్మా ఏదో మాయా

సీతకీ రాముడే సొంతమయ్యే చోటిది
నేలతో ఆకసం వియ్యమొందే వేళిది
మూడు ముళ్లు వేస్తే
మూడు లోకాలకి ముచ్చటొచ్చేనమ్మా... ఓ...
ఏడు అంగలేస్తే ఏడు జన్మలకీ వీడదీ సీతమ్మా

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది
చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాటా
ఆ మాటా విన్నావా రామా అంటుంది
రామా రామా అన్నది ఆ సీతా గుండె
అన్ననాడే ఆమెకు మొగుడయ్యాడే

చేతిలో చేతులే చేరుకుంటే సంబరం
చూపులో చూపులే లీనమైతే సుందరం

జంట బాగుందంటూ గొంతు విప్పాయంటా
చుట్టూ చెట్టూ చేమా... ఓ...
పంట పండిందంటూ పొంగి పోయిందమ్మా
ఇదిగో ఈ సీతమ్మ... ఓ...


2 comments:

పచ్చని పెళ్ళి పందిర్లలో వినిపించే కొద్ది పాటల్లో చేరిన హృద్యమైన పాట..

అవునండీ శ్రీకాంత్ అడ్డాల అభిరుచిని మెచ్చుకుని తీరవలసిన పాట.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail