బుధవారం, ఏప్రిల్ 05, 2017

అదిగో అదిగో భద్రగిరి...

మిత్రులందరకూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు శ్రీరామదాసు చిత్రంలోని ఓ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ.


చిత్రం : శ్రీరామదాసు (2006)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

ఓం ఓం ఓం 
శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
 
అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
ఏ వాల్మీకీ రాయని కధగా సీతారాములు తనపై ఒదగా
రామదాసకృత రామపదామృత వాగ్గేయస్వర సంపదగా
వెలసిన దక్షిణ సాకేతపురి
అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి

రాం రాం రాం రాం

రామనామ జీవన నిర్నిద్రుడు
పునఃదర్శనము కోరిన భద్రుడు
సీతారాముల దర్శనానికై
ఘోరతపస్సును చేసెనప్పుడు
తపమును మెచ్చి ధరణికి వచ్చి
దర్శనమిచ్చెను మహావిష్ణువు

సాససానిదని సానిదామగమ సాసరిదామప

త్రేతాయుగమున రామరూపమే
త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు
ఆదర్శాలకు అగ్రపీఠమౌ
ఆ దర్శనమే కోరెనప్పుడు
ధరణీపతియే ధరకు అల్లుడై
శంఖచక్రములు అటు ఇటు కాగా
ధనుర్బాణములు తనువై పోగా
సీతాలక్ష్మణ సహితుడై
కొలువు తీరె కొండంత దేవుడు

శిలగా మళ్ళీ మలచి
శిరమును నీవే నిలచి
భద్రగిరిగ నను పిలిచే
భాగ్యము నిమ్మని కోరె భద్రుడు


వామాంకస్థిత జానకీ పరిలస
కోదండ దండం కరే
చక్రం చోర్భకరేణ బాహు యుగళే
శంఖం శరం దక్షిణే
విఘ్రాణం జలజాత పత్ర నయనం
భద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం
సౌమిత్రి యుక్తం భజే

అదిగో అదిగో భద్రగిరి
ఆంధ్రజాతికిది అయోధ్యాపురి


2 comments:

శ్రీరామనవమి శుభాకాంక్షలు వేణూజీ..

థాంక్స్ శాంతి గారు.. మీకు కూడా పండుగ శుభాకాంక్షలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail