శనివారం, ఏప్రిల్ 15, 2017

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్...

ఈ రోజు కిల్లర్ సినిమాలోని టైటిల్ సాంగ్ తలుచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కిల్లర్ (1992) 
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, చిత్ర 

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్
మిస్సుకు నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్
హహ హా... హహ హా... హహ హాహాహా..

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్
ఈ మిస్సుకు నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్
ఒక ఆట ఆడిస్తా ఒడిలోనే ఓడిస్తా
ఓయ్ నువ్వే నా కిల్లర్.. హోయ్ my name is eeswar
హోయ్ నువ్వే నా కిల్లర్.. my name is eeswar

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్
ఈ మిస్సుకు నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్

నా జీవితం ఇది ఓ నాటకం
విధితో విధిగా పోరాటం
నా సంతకం యమ ప్రాణాంతకం
విలనే అననీ ఈ లోకం
యముడుకి పాశం తగిలించే మొనగాడిని
మదనుడి బాణం విరిచేసే మగవాడిని
అదిసరి నీ పనిసరిలే చెలి దరిలో
you are my love king.. I have a liking..
you are my love king.. I have a liking..

ఆటల్లో పాటల్లో నవ్వించి కవ్వించు అంకుల్
ఊకొట్టి జోకొట్టి ఊరెళ్ళిపోతాడు టింకుల్
అందుతున్న మేనమామ అందగానే చందమామ
you are my lover.. my name is eeswar..
హో you are my lover.. my name is eeswar..

నా డ్యాన్సులో తొలి రొమాన్సులో
జతిని రతిని నేనంట
నా వేటలో చలి సయ్యాటలో
ఎరనై ఎదుటే నేనుంటా
నెమలికి పింఛం పురివిప్పే నటరాజుని
రమణికి అందం పులకించే రసరాజుని
కథాకళిలో మణిపురిలో కలయికలో
నీ చూపే వింటర్ నా ముద్దే కౌంటర్
హో నీ చూపే వింటర్ నా ముద్దే కౌంటర్

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్ యా
ఈ మిస్సుకు నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్
ఒక ఆట ఆడిస్తా ఒడిలోనే ఓడిస్తా
ఓయ్ నువ్వే నా కిల్లర్... my name is eeswar
హోయ్ నువ్వే నా కిల్లర్.. హోయ్ my name is eeswar

ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్
ఈ మిస్సుకు నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.