గురువారం, మే 26, 2016

శుభలేఖ రాసుకున్నా...

కొండవీటిదొంగ చిత్రం కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కొండవీటి దొంగ (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
పుష్యమి పూవ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో...

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో...

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో

చైత్రమాస మొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి
మల్లె మబ్బులాడెనేమో బాల నీలవేణికి

మెచ్చి మెచ్చి చూడసాగె గుచ్చే కన్నులు
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు
అంతేలే కథంతేలే అదంతేలే...

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
పుష్యమి పూవ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో...

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో! 
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో

హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో
రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
వేసవల్లె వేచి ఉన్నా వేణు పూలతోటలో

వాలు చూపు మోసుకొచ్చె ఎన్నో వార్తలు
వొళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలు
అంతేలే కధంతేలే అదంతేలే...

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో  
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో...

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
  


1 comments:



శుభ లేఖ రాసుకున్నా
గబగబ వచ్చా జిలేబి గంధము బూయన్ !
సొబగుల జూచితి రమణీ
విభావరి సుమధుర సరస విరహము తీరన్ !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.