మంగళవారం, మే 03, 2016

ఎందుకు కలిగెను...

అగ్గిబరాటా చిత్రంలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అగ్గిబరాటా
సంగీతం : విజయా కృష్ణమూర్తి
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

ఊమ్.మ్... హొయ్ హోయ్ హోయ్ హొయ్..
ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను
ఈ వింత... ఏ వింతా .. ?
ఏ నాడు లేని వింత లోలోన చక్కిలిగింత

హొయ్ హోయ్ హోయ్ హొయ్..
ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను
ఈ వింత.. ఏ వింతా.. ?
ఏనాడు లేని వింత లోలోన చక్కిలిగింత
హొయ్ హోయ్ హోయ్ హొయ్..

నిన్ను నేను చూసిన నాడే కన్ను చెదరిపోయింది
నిన్ను నేను చూసిన నాడే కన్ను చెదరిపోయింది
కన్ను చెదరిపోయిన నాడే కన్నెమనసు మారింది
నీ లేత వన్నె ఏదో నాలోన మెరిసింది..
నీ లేత వన్నె ఏదో నాలోన మెరిసింది..
హొయ్ హోయ్ హోయ్ హొయ్..

ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను
ఈ వింత ఈ వింత

నిగ్గులొలుకు బుగ్గలు చూసీ నిలిచిపోతి ఆనాడు
నిగ్గులొలుకు బుగ్గలు చూసీ నిలిచిపోతి ఆనాడు
చేతినిండ సిగ్గులు దూసీ చేరుకుంటి ఈ నాడూ
అందాల తీరమేదో అందుకుంటి నీతోడూ
అందాల తీరమేదో అందుకుంటి నీతోడూ
హొయ్ హోయ్ హోయ్ హొయ్..

ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను
ఈ వింత ఈ వింత
ఏనాడు లేని వింత లోలోన చక్కిలిగింత
ఏనాడు లేని వింత లోలోన చక్కిలిగింత 

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.