శనివారం, మే 21, 2016

వయసే తొలి వసంతాలాడు...

ఇళయరాజా గారి స్వర రచనలో చైతన్య చిత్రం కోసం వేటూరి గారు రాసిన ఒక అందమైన పాట ఈ రోజు విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చైతన్య (1991)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

వయసే తొలి వసంతాలాడు వాలు పొద్దుల్లో
సొగసే చలిసరాగాలాడు సందె ముద్దుల్లో
 
మనసే ఒక సవాలైపోయె మల్లె మొగ్గల్లో
పిలుపే తొలి ఫిడేలైపోయె పిల్ల సిగ్గుల్లో
మనకొద్దీ వాయిదాలూ పరువాలే జీవితాలూ
కుర్రకారుల్లో కొత్త ట్యూన్సూ
జార విడిచావా లేదు ఛాన్సూ

వయసే తొలి వసంతాలాడు వాలు పొద్దుల్లో
సొగసే చలిసరాగాలాడు సందె ముద్దుల్లో

 
కవ్విస్తే ఖలేజాలు చూపే కాళీ మార్కు యువతులం
నవ్విస్తే సరోజాలు పూసే వయ్యారాల వనితలం
సూర్యుణ్ణే హలో అంటాం చంద్రుణ్ణే ప్రియా అంటాం
ఇంద్రుణ్ణే ఛలో అంటాం స్వర్గంలో మకాం వేస్తాం
భామ తన్నింది ప్రేమ పుట్టింది వలపుల క్రియల్లో

 
వయసే తొలి వసంతాలాడు వాలు పొద్దుల్లో
సొగసే చలిసరాగాలాడు సందె ముద్దుల్లో

 
సరసంలో కులాసాలు చేసే శృంగారాల పురుషులం
సమరంలో భరోసాలు చూపే ఝాన్సీ రాణి గురుతులం 
మానండీ యురేకాలూ మాటల్లో మజాకాలూ
ఎదిరిస్తాం తడాకాలూ ఎగరేస్తాం పతాకాలూ
యుగం మారింది జగం మారాలి జనగణమనల్లో
 
వయసే తొలి వసంతాలాడు వాలు పొద్దుల్లో
సొగసే చలిసరాగాలాడు సందె ముద్దుల్లో 
మనసే ఒక సవాలైపోయె మల్లె మొగ్గల్లో
పిలుపే తొలి ఫిడేలైపోయె పిల్ల సిగ్గుల్లో
మనకొద్దీ వాయిదాలూ పరువాలే జీవితాలూ
కుర్రకారుల్లో కొత్త ట్యూన్సూ 
జార విడిచావా లేదు ఛాన్సు 




0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.