శనివారం, ఫిబ్రవరి 27, 2016

యమహో నీ యమ యమ అందం...

ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

యమహో నీ యమ యమ అందం
చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ ఝమ ఝమ వాటం
సుడి రేగింది ఎడా పెడా తాళం
పోజుల్లో నేను యముడంత వాడ్ని
మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని
అల్లారు ముద్దుల్లో గాయం
విరబూసింది పువ్వంటి ప్రాయం

యమహో నీ యమ యమ అందం
చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ ఝమ ఝమ వాటం
సుడి రేగింది ఎడా పెడా తాళం

నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి
గుట్టుగా సెంటే కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి
తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టీ
పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి
చీకటింట దీపమెట్టి చీకుచింత పక్కానెట్టి
నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి

పెట్టూపోతా వద్దే చిట్టెంకి
చెయి పట్టిన్నాడే కూసే వల్లంకి
పెట్టేది మూడే ముళ్ళమ్మి
నువ్వు పుట్టింది నాకోసమమ్మి
ఇక నీ సొగసు నా వయసు పేనుకొనే ప్రేమలలో

యమహో నీ యమ యమ అందం
చెలరేగింది ఎగా దిగా తాపం 
నమహో నీ ఝమ ఝమ వాటం
సుడి రేగింది ఎడా పెడా తాళం

పట్టె మంచమేసిపెట్టి పాలు పెట్టి పండు పెట్టి
పక్క మీద పూలు కొట్టి పక్కా పక్కా లొళ్ళో పెట్టి
ఆకులో వక్క పెట్టి సున్నాలెట్టి చిలకా చుట్టి
ముద్దుగా నోట్లో పెట్టి పరువాలన్ని పండాపెట్టి
చీర గుట్టు సారే పెట్టి సిగ్గులన్ని ఆరాబెట్టి
కళ్ళలోన వత్తులెట్టి కౌగిలింత మాటు పెట్టి

ఒట్టే పెట్టి వచ్చేసాక మామా
నిను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమా
చెట్టెయ్యి సందె సీకట్లోనా
నను కట్టెయ్యి కౌగిలింతల్లోనా
ఇక ఆ గొడవ ఈ చొరవ ఆగవులే అలజడిలో

యమహో నీ యమ యమ అందం
చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ ఝమ ఝమ వాటం
సుడి రేగింది ఎడా పెడా తాళం
పోజుల్లో నేను యముడంత వాడ్ని
మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని
అల్లారు ముద్దుల్లో గాయం
విరబూసింది పువ్వంటి ప్రాయం

యమహో నీ యమ యమ అందం
చెలరేగింది ఎగా దిగా తాపం 
 



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.