బుధవారం, ఫిబ్రవరి 17, 2016

కలికి మేనిలో కలిగే...

ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో సినారె గారు రచించిన ఓ చక్కని ప్రేమగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం: సంకీర్తన (1987)
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : సినారె
గానం : బాలు, జానకి

కలికి మేనిలో కలిగే స్పందనం
కలికి మేనిలో కలిగే స్పందనం
ఇలకూ వెన్నెలకూ
ఇలకూ వెన్నెలకూ
జరిగే సంగమం
కలికి మేనిలో కలిగే స్పందనం
కలికి మేనిలో
  
రంగుల కలగా మెరిసే ఆకాశం
ముంగిట తానే నిలిచే
తోటకు వరమై దొరికే మధుమాసం
గూటిని తానే వలచే
గర్భ గుడిని దాటి కదిలింది దేవతా
గర్భ గుడిని దాటి కదిలింది దేవతా
చేయి అందుకొమ్మని చేరుకుంది నీ జత

కలికి మేనిలో కలిగే స్పందనం
ఇలకూ వెన్నెలకూ
ఇలకూ వెన్నెలకూ జరిగే సంగమం
కలికి మేనిలో కలిగే స్పందనం
కలికి మేనిలో
 
పెదవుల వలలో పెరిగే ఏకాంతం
ప్రేమకు పేరై ఎగిసే
తలపుల వడిలో ఒదిగే అనురాగం
తలుపులు తానే తెరిచే
తల్లి నేల వేసే మన పెళ్ళి పందిరి
తల్లి నేల వేసే మన పెళ్ళి పందిరి
వేయి జన్మలెత్తినా వీడదు మన కౌగిలి

కలికి మేనిలో కలిగే స్పందనం
కలికి మేనిలో కలిగే స్పందనం
ఇలకూ వెన్నెలకూ
జరిగే సంగమం
కలికి మేనిలో కలిగే స్పందనం
కలికి మేనిలో


 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail