సోమవారం, ఫిబ్రవరి 01, 2016

చినుకులా రాలి...

నాలుగు స్తంభాలాట చిత్రంకోసం వేటూరి గారు రచించిన ఓ అందమైన ప్రేమ గీతాన్ని ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నాలుగు స్తంభాలాట (1982)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను
మరిచిపోబోకుమా 
మమత నీవే సుమా
 
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ

 
ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమను కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే
జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువవుతానులే
 
నీ నవ్వులే చాలులే
 
హిమములా రాలి సుమములై పూసి
రుతువులై నవ్వి మధువులై పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా శిధిలమైనా విడిచిపోబోకుమా
విరహమై పోకుమా

 
తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే
పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్నానులే
 
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే
 
మౌనమై మెరిసి గానమై పిలిచి
కలలతో అలిసి గగనమై ఎగసి
నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైనా గగనమైనా 
ప్రేమమయమే సుమా
ప్రేమ మనమే సుమా
 
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
  

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail