శుక్రవారం, డిసెంబర్ 25, 2015

మాట మీరగలడా...

శ్రీకృష్ణుడు తన మాటలకు కట్టుబడి ఉండే భార్యా విధేయుడు అనుకునే సత్యభామ ధీమాను ఈ పాటలో మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీ కృష్ణ సత్య (1971)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల
గానం : జానకి

మాట మీరగలడా..నేగీచిన గీటు
దాటగలడా..సత్యాపతి
మాట మీరగలడా..ఆ..మాట మీరగలడా..ఆ
మాట మీరగలడా..ఆ..మాట మీరగలడా

పతివలపంతా..నా వంతేనని
సవతుల వంతు..రవంత లేదనీ
పతివలపంతా..నా వంతేనని  
సవతుల వంతు..రవంత లేదనీ
రాగ సరాగ..వైభోగ లీలలా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రాగ సరాగ..వైభోగ లీలలా
సరస కేళి..తేల్చే సాత్రాజితి

మాట మీరగలడా..నేగీచిన గీటు
దాటగలడా సత్యాపతి..మాట మీరగలడా..ఆ

నారీ లోకము ఔరా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నారీ లోకము ఔరా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
నారీ లోకము ఔరా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నారీ లోకము..ఔరా యనగా
నా సవతులు గని తలలు వంచగా
వ్రతము నెరపు దానా ఆ మీదట మాట మీరగలడా

మాట మీరగలడా..నేగీచిన గీటు
దాటగలడా..సత్యాపతి..మాట మీరగలడా..ఆ

 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.