మంగళవారం, డిసెంబర్ 01, 2015

చెలీ నీ కోరికా..

సుగుణ సుందరి కథ చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : సుగుణసుందరి కథ (1970)
సంగీతం : ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం : సినారె
గానం : రామకృష్ణ, సుశీల

చెలీ నీ కోరికా గులాబీ మాలిక
చెలీ నీ కోరికా గులాబీ మాలిక
గుబాళించేనిక అదే నా వేడుక
ప్రియా నా కోరికా గుబాళించేనిక
ప్రియా నా కోరికా గుబాళించేనిక 
అదే నీ కానుక ఇదే నా వేడుక

నీల గగనాల జాబిల్లివై
పాల పరువాల సిరిమల్లెవై
నీల గగనాల జాబిల్లివై
పాల పరువాల సిరిమల్లెవై
మిన్ను లందించవే నన్ను అలరించవే
మిన్ను లందించవే నన్ను అలరించవే
ఎన్నో అనురాగ సుమ డోలలూగించవే

ప్రియా నా కోరికా గుబాళించేనిక 
అదే నీ కానుక ఇదే నా వేడుక

నిన్ను విడలేని పదదాసినై
ఎన్నో పుణ్యాల ఫలరాసినై
నిన్ను విడలేని పదదాసినై
ఎన్నో పుణ్యాల ఫలరాసినై
నిన్నే సేవించనా నీవై జీవించనా
నిన్నే సేవించనా నీవై జీవించనా
జీవితానంద తీరాల విహరించనా

చెలీ నీ కోరికా గులాబీ మాలిక
గుబాళించేనిక అదే నా వేడుక


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail